రోడ్డెక్కడానికి ఏథర్ 450ఎక్స్ జెన్- 3 ఈవీ రెడీ!
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’.. ఏథర్ 450 జెన్-3 స్కూటీని లాంఛ్ చేసింది.
Source: Ather
దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 105 కి.మీ. వెళ్తుందని కంపెనీ చెబుతోంది.
Source: Ather
దీని టాప్ స్పీడ్ 80 కి.మీ కాగా.. కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0- 40 కి.మీ వేగం అందుకుంటుంది. రివర్స్ అసిస్ట్(గంటకు 2కి.మీ వేగం) సదుపాయం కూడా ఉంది.
Source: Ather
టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ సౌకర్యం ఉంది. బ్లూ టూత్‌తో కనెక్ట్ చేసి ఫోన్ కాల్స్‌ను యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయొచ్చు. నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ చేసే సౌకర్యం ఉంది.
Source: Ather
డ్యాష్‌బోర్డ్ స్నాప్‌డ్రాగన్ 212 క్వాడ్‌కోర్ 1.3జీహెచ్‌జెడ్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజీ సౌకర్యం ఉంది.
Source: Ather
హోమ్ ఛార్జర్(ఏథర్ డాట్)తో పాటు పోర్టబుల్ ఛార్జర్, ఏథర్ గ్రిడ్ వద్ద స్కూటీకి ఛార్జింగ్ చేసుకోవచ్చు.
Source: Ather
బ్యాటరీ 100 శాతం ఛార్జింగ్ అవ్వడానికి(హోమ్ ఛార్జర్‌తో) 5గంటల 45 నిమిషాలు పడుతుంది.
Source: Ather
ఈ ఏడాది డిసెంబర్ వరకు ఏథర్ ఎనర్జీకి చెందిన స్కూటీలు అన్ని గ్రిడ్‌ల వద్ద ఉచితంగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
Source: Ather
వైట్, స్పేస్ గ్రే, మింట్ గ్రీన్ రంగుల్లో మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
Source: Ather
హైదరాబాద్‌లో ఏథర్ 450ఎక్స్ జెన్- 3 షోరూం ధర రూ.1,57,402గా ఉంది. ఈ నెలలోనే మార్కెట్‌లోకి రానుంది.
Source: Ather