‘3’తో మళ్లీ వస్తోన్న శ్రుతి

సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ ట్రెండ్‌ షురూ అయింది. ఇప్పటికే ‘పోకిరి’, ‘జల్సా’ మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. ధనుష్‌, శ్రుతి హాసన్‌ జంటగా వచ్చిన ‘3’ కూడా రీ రిలీజ్‌ కానుంది.

Image:Twitter

సెప్టెంబరు 8న ‘3’ని మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ మూవీలోని ‘వై దిస్‌ కొలవెరి...’ పాట మంచి ఆదరణ పొందింది. సినిమాలో నటనకు శ్రుతికి మార్కులు పడ్డాయి కూడా.

Image:Instagram/Shruti Haasan

 ‘3’ రీ రిలీజ్ సందర్భంగా శ్రుతి తాజా సినిమాలపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం ఆమె చేతిలో 3 తెలుగు చిత్రాలున్నాయి.

Image:Instagram/Shruti Haasan

#NBK107లో నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తోంది.

Image:Instagram/Shruti Haasan

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’లోనూ కథానాయిక శ్రుతినే.

Image:Instagram/Shruti Haasan

చిరంజీవి - బాబీ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ రూపొందుతోంది. ఇందులో చిరుకు జోడీగా శ్రుతి నటిస్తోంది.

Image:Instagram/Shruti Haasan

తెలుగులో ఆమె ఆఖరిగా పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్ సాబ్‌’లో నటించింది.

Image:Instagram/Shruti Haasan

‘వకీల్ సాబ్‌’లో పవన్‌ కల్యాణ్‌ భార్య పాత్రలో కనిపించింది శ్రుతి.

Image:Instagram/Shruti Haasan

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home