ధోనీ.. ది చెన్నై కింగ్‌!

ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫైనల్‌కు చేరుకుంది. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లకు గానూ 8 విజయాలు నమోదు చేసింది. క్వాలిఫయర్‌ 1లో గుజరాత్‌ టైటన్స్‌పై విజయం సాధించి నేరుగా ఫైనల్‌ ఆడబోతోంది.

సీఎస్‌కే దూకుడుకి ముఖ్య కారణం ఆ జట్టు కెప్టెన్‌ ఎం.ఎస్‌.ధోనీ. తన సుదీర్ఘ అనుభవంతో జట్టును గెలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలో ధోనీ గణాంకాలపై ఓ లుక్కేద్దామా...?

సీఎస్‌కే తరఫున ధోనీ ఇప్పటి వరకు 14 సీజన్లు ఆడారు. 2016-17లో రైజింగ్‌ పుణె సుపర్‌జెయింట్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

ధోనీ సారథ్యంలో సీఎస్‌కే జట్టు 10 సార్లు ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది. నాలుగు సార్లు కప్‌ సొంతం చేసుకుంది.

ఇప్పటి వరకు ధోనీ ఆడిన మ్యాచ్‌లు - 249

ఐపీఎల్‌ మొత్తంలో చేసిన పరుగులు - 5,082

ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్‌ - 84 నాటౌట్‌

అర్ధశతకాల సంఖ్య - 24

ఫోర్లు - 349

సిక్సులు - 239

టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్ తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే!

ఒకే ఇన్నింగ్స్‌లో ఏడు క్యాచ్‌లు పట్టిన వారి జాబితా ఇదే!

పారాలింపిక్స్‌.. చరిత్రలో ‘ఫస్ట్’ పతక వీరులు

Eenadu.net Home