అందాల అపరంజి.. అపర్ణ..
అపర్ణ బాల మురళి ఈ పేరు విన్నారా..? తమిళ, మలయాళ చిత్రాల్లో ఫేమస్ యాక్టర్. అదేనండీ.. ‘ఆకాశమే నీ హద్దురా’లో సూర్య సరసన బేబి పాత్ర పోషించిన భామ. తాజాగా ‘ధూమమ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(photos:instagram/aparna.balamurali)
ఫాహద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లో సందడి చేసి.. ఆగస్టు 4న ఓటీటీలో విడుదలైంది. ఇందులో అపర్ణ కీలక పాత్ర పోషించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి పవన్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో అపర్ణ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ మధ్యే ‘2018’ చిత్రంతో అపర్ణ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఈమె టీవీ రిపోర్టర్‌గా కనిపించింది.
కేరళలోని త్రిసూర్‌లో 1995లో జన్మించిన అపర్ణ.. అక్కడే చదువుకుంది. బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.
తండ్రి కె.పి బాల మురళి మ్యూజిక్ డైరెక్టర్. దీంతో నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చేసింది. 2013లో ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత ‘జీం భూం భా’, ‘మిస్టర్ అండ్ మిసెస్ రౌడీ’, ‘సర్వం తల మాయం’, ‘అల్లు రామేంద్రం’, ‘ఉల’, ‘కాప’, ‘కిష్కింద కాండం’ వంటి పలు చిత్రాలతో ఆకట్టుకుంది.
అపర్ణ.. నటిండచమే కాదు, పాటలు కూడా బాగా పాడుతుంది. క్లాసికల్ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యముంది. స్టేజీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది.
అపర్ణ షూటింగ్ నుంచి ఏ కాస్త సమయం దొరికినా ట్రావెల్ చేయడానికే ఇష్టపడుతుందట. డ్యాన్స్, పుస్తకాలు చదవడం కూడా ఈ భామకు బాగా నచ్చుతుందట.