వినాయకుడికి ఎన్ని పేర్లో..!

విఘ్నాలు తొలగించే వినాయకుడిని ఎన్నో పేర్లతో భక్తులు కొలుస్తారు..! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పూజలందుకుంటాడు. మరి ఆయనకు ఎన్ని పేర్లున్నాయి..? వాటి వెనకున్న కథ ఏంటో తెలుసుకోండి.

వినాయకుడికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ప్రజలు, ఆయా ప్రాంతాల్లో పెట్టిన పేర్లు 108. అన్ని విధాలుగా ఆయన పూజలందుకుంటాడు.

పురాణాల ప్రకారం తొలిపేరు వక్రతుండ..మత్సార రాక్షసుడిని వక్రతుండుడి రూపంలో సంహరించి దేవతలకు మళ్లీ రాజ్యాన్నిఅప్పగించడంలో సహకరించాడని ప్రతీతి.

వినాయకుడికి ఒకే దంతం ఉండటంతో ఏకదంతుడని పిలుస్తారు. పరమేశ్వరుడిని కలుసుకోవడానికి వచ్చిన పరుశరాముడిని వినాయకుడు అడ్డుకోవడంతో ఒక దంతాన్ని విరిచేశాడని చెబుతారు.

లంబోదరుడు..భారీ బొడ్డున్న వాడని అర్థం. అందవల్లనే వినాయకుడికి ఈ పేరువచ్చింది.

విఘ్నేశ్వరుడు..విఘ్నాలను తొలగించే వాడని భక్తుల విశ్వాసం. దేవతలకు కూడా ఏ విఘ్నం వచ్చినా రక్షించేందుకు ముందుంటాడు. అందుకే ఈ పేరొచ్చింది. 

గౌరీసుతుడు..పార్వతీదేవి సుతుడు కావడంతోనే ఈ పేరొచ్చింది. గొప్ప నాయకత్వ లక్షణాలున్నాయని దేవతలు పేర్కొంటారు.

గజాననుడు..ఏనుగు తల ఉండటం వల్ల ఈ పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకత ఏ దేవుడికి లేదు.

ఓంకారుడు..జీవితాన్ని సరైన దారిలో నడిపేవాడని నమ్ముతారు. ఆయన్ని కొలిస్తే చాలు కోరికలన్నీ తీరతాయి. మంచి జీవితం లభిస్తుంది.

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home