విభిన్న రూపాల్లో గణనాథుడు

కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో నందీశ్వర ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో శ్రీ రాముని అవతారంలో ఉన్న గణనాథుడిని ప్రతిష్టించారు.

Image:Eenadu

వరంగల్‌ రామన్నపేటలో ఈకలతో రూపొందించిన గణనాథుడు

Image:Eenadu

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్ చౌరస్తాలో భక్త హిందూ గణేష్ మండలి వారు చిన్న చిన్న గంటలతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Image:Eenadu

విజయవాడ ఎంజీ రోడ్డులో డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన వినాయకుడు

Image:Eenadu

కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో అడవి టెంకాయలు, కమలాక్షి పూసలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని తయారీకి సుమారు రూ.2లక్షలు ఖర్చు అయింది.

Image:Eenadu

హైదరాబాద్‌ వనస్థలిపురంలో మట్టి ప్రమిదలతో వినాయకుడు

Image:Eenadu

హైదరాబాద్‌: పాత బస్తీలోని నాగులచింత వద్ద 20 అడుగుల ఎత్తులో అయ్యప్ప ఆకృతిలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహం

Image:Eenadu

హైదరాబాద్‌: హనుమాన్ చౌక్‌లో పంచముఖి హనుమాన్ అవతారంలో గణనాథుడి విగ్రహం

Image:Eenadu

హైదరాబాద్‌: నాచారంలోని బాబానగర్ ప్రాంతంలో పిల్లలు ఆడుకునే క్యూబ్స్‌తో రూపొందించిన వినాయకుడు.

Image:Eenadu

సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో ఏర్పాటు చేసిన ఆహార ధాన్యాల(సాబుదాన, బొబ్బర్లు, ఎర్రపప్పు, రాజ్మా) గణనాథుడు

Image:Eenadu

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎదురుగా ఓ వీధిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో పోరాడుతున్నట్లుగా ఉన్న గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Image:Eenadu

తిరుపతి సున్నపు వీధిలో టెంకాయలతో తీర్చిదిద్దిన గణనాథుడి విగ్రహం.

Image:Eenadu

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి గొల్లవీధిలో ఏర్పాటు చేసిన సింహాద్రి అప్పన్న రూప గణపతి

Image:Eenadu

హనుమకొండలోని గుడిబండల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వినాయకుడిని ఎత్తుకున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినూత్నంగా ఉన్న ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.

Image:Eenadu

వినాయక చవితి సందర్భంగా మండపాల్లో విభిన్న రూపాల్లో ఉన్న వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ చోట ‘కేజీఎఫ్‌-2’లో యశ్‌ పాత్రను పోలిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Image:Eenadu

దుర్గా మాత ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమివ్వనుంది..

బతుకమ్మ గురించి ఆసక్తికర విషయాలు

రాగి గణపతిని చూశారా!

Eenadu.net Home