‘క్రేజీ ఫెలో’లో క్రేజీ భామ.. దిగంగన!

బుల్లితెరపై పలు సీరియల్స్‌తో సందడి చేసిన దిగంగన సూర్యవంశీ సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అలరిస్తోంది.

Image:Instagram

 గతేడాది ‘సీటీమార్‌’తో అలరించిన ఈ భామ.. ఇప్పుడు ‘క్రేజీఫెలో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image:Instagram

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ఫణికృష్ణ సిరికి తెరకెక్కించిన ‘క్రేజీ ఫెలో’ తాజాగా విడుదలైంది.

Image:Instagram 

దిగంగన 1997 అక్టోబర్‌ 15న ముంబయిలో జన్మించింది. ప్రస్తుతం ముంబయిలోని నర్సీ మోంజీ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది.

Image:Instagram

‘ఫ్రైడే’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘హిప్పి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Image:Instagram

‘ధనుస్సు రాశి నేయర్గలే’ అనే తమిళ చిత్రంలోనూ నటించింది.

Image:Instagram

ప్రస్తుతం ఈమె చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో రెండు హిందీ, ఒక తెలుగు చిత్రం ఉన్నాయి.

Image:Instagram

జమ్మూ కశ్మీర్‌, లాస్‌ ఏంజెల్స్ ఇష్టమైన ప్రదేశాలట.పిజ్జా, పాస్తా, కేక్స్‌ని తెగ లాగించేస్తుంది.

Image:Instagram


ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఇన్‌స్టాలో 1.2 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home