ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్రమ్ ఇండియా
ముంబయికి చెందిన దీపా బుల్లర్ ఖోస్లా గత ఆరేళ్లుగా కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొంటోంది. ఈ ఏడాది కూడా అదే జోష్‌తో అంతే ట్రెండీగా సందడి చేసింది.
ఈ ఏడాది మెటాలిక్ మోడ్రన్ డ్రెస్సు ధరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. అచ్చం జలకన్యలా మెరిసిపోయింది.
బ్యూటీ ప్రొడక్ట్స్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఈమె.. ఫాలోయింగ్ పెరగడంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
చెన్నైలో దీపా విద్యాభ్యాసం జరిగింది. తల్లి వైద్యురాలు. దీంతో తన వృత్తినే ఎంచుకోమని సలహా ఇచ్చారు. మెడిసిన్‌లో జాయిన్ అయిన తర్వాత మధ్యలోనే విరమించి న్యాయ శాస్ర్తాన్ని ఎంచుకుంది.
లండన్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇంటర్న్‌గా చేరింది. తర్వాత డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా అవతారమెత్తింది. తొలుత బ్యూటీ టిప్స్‌తో వీడియోలు చేయడం మొదలుపెట్టింది.
డచ్‌కి చెందిన ఒలెగ్ బుల్లర్‌ని 2018లో వివాహమాడింది. అప్పటి నుంచి వారిద్దరి క్యూట్, ఫన్నీ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకోవడం ప్రారంభించింది. దాంతో ఖోస్లా ఇంకా ఫేమసయ్యింది. ప్రస్తుతం వీరికి ఒక పాప.
తన వంతు సామాజిక బాధ్యతగా 2019లో దీపా తన భర్తతో కలిసి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ని స్థాపించింది. అనాథలకు సాయం చేసేందుకు, మహిళా సాధికారత కోసమే దీన్ని నెలకొల్పింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకూ అండగా నిలుస్తుంటుంది.
This browser does not support the video element.
దీపా.. కేన్స్‌కు ఎంపికైన మహిళల్లో మొదటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. మొదటి సారిగా 2018లో కేన్స్‌లో పాల్గొంది. అప్పటి నుంచి ఆరేళ్లుగా అదే జోరును కొనసాగిస్తోంది.
దీపా తన తల్లిని స్ఫూర్తిగా తీసుకొని 2022లో ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులతో ఓ సంస్థని ప్రారంభించింది. వాళ్లమ్మ ఉపయోగించే సూత్రాలతో హెయిర్ ఆయిల్, లిప్‌బామ్ తదితర ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. అనతికాలంలోనే వాటికి మంచి గుర్తింపు లభించింది.
‘ఆయుర్వేదంతో నేను ప్రేమలో పడ్డాను. ఎందుకంటే వాటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్లే ఎవరికీ ఎటువంటి అపాయం కలగకుండా నేను ఈ దారిని ఎంచుకున్నా’ అంటోంది ఈ బ్యూటీ.
గ్లామర్ పోజులతో ఇన్‌స్టాలో యువతను కట్టిపడేస్తుంటుంది. తన ఇన్‌స్టాఖాతా ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్ల పైమాటే..!