ఆ తెలుగు సినిమా హీరోయినే.. బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌

This browser does not support the video element.

ఓటీటీ వేదికగా ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌-3లో సనా మక్బుల్‌ విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజ్‌ మనీ గెలుచుకుంది.

అనిల్‌ కపూర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోకు సనా, ర్యాపర్‌ నేజీలు ఫైనల్‌కు చేరుకున్నారు. అత్యంత ఉత్కంఠ భరితమైన క్షణాల మధ్య సనాను విజేతగా ప్రకటించారు..

సనా వ్యక్తిగత విషయాలకొస్తే.. మహారాష్ట్ర (1993)లో పుట్టింది. పాఠశాల చదువంతా ముంబయిలోనే సాగింది. 

ఆర్‌.డి నేషనల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది సనా. తల్లిది కేరళ. తండ్రిది ముంబయి.

This browser does not support the video element.

నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలుపెట్టింది. ప్రకటనల ద్వారా బుల్లితెరపై వైపు అడుగులు వేసింది. 

‘ఇషాన్‌: సప్నో కో అవాజ్‌ దే’ అనే మ్యూజిక్‌ సిరీస్‌ ద్వారా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత వరుస టెలివిజన్‌ షోలు, సీరియల్స్‌తో అభిమానుల్ని సంపాదించుకుంది.

‘దిక్కులు చూడకు రామయ్య’తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. ‘మామా ఓ చందమామ’తోనూ అలరించింది. తమిళంలో ‘రంగూన్‌’తో ఎంట్రీ ఇచ్చింది.

తమిళంలో ‘కాదల్‌ కండిషన్స్‌ అప్లై’ అనే చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తోనూ అలరించింది.

క్యూట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో కుర్రకారును హీటెక్కిస్తుంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 24 లక్షలకు పైమాటే.

This browser does not support the video element.

ఈ బీటౌన్‌ బ్యూటీకి విహార యాత్రలంటే మహా ఇష్టం. ఇన్‌స్టాలో సగానికి పైగా ఆ ఫొటోలే కనిపిస్తాయి. 

‘ప్రతి ఒక్కరినీ సంతోష పరిచేవి కొన్ని విషయాలుంటాయి. అలా నాకు ఫుడ్‌, మ్యూజిక్‌, స్విమ్మింగ్‌.. ఈ మూడు ఉంటే చాలు. నా సంతోషానికి అవధులుండవు’ అంటోందీ బ్యూటీ.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home