సింపుల్‌ డింపుల్‌... ఈ రోజు ఆమెకు స్పెషల్‌..

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా ఐటెమ్‌ సాంగ్‌తోనే పాపులర్‌ అయ్యింది డింపుల్‌ హయాతి. ఆ తర్వాత ‘ఖిలాడీ’తో పెద్ద సినిమాల వైపు వచ్చింది. ఈ భామ ఈ రోజు (ఆగస్టు 21న) పుట్టిన రోజు జరుపుకుంటోంది.

(photos:instagram/dimplehayathi)

‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్రా...’ అంటూ వరుణ్‌తేజ్‌ సరసన ఐటమ్‌సాంగ్‌లో ఆడిపాడిన భామనే డింపుల్‌ హయాతి. ఆ తర్వాత వెంటనే అవకాశాలు రాకపోయినా.. రవితేజ ‘ఖిలాడీ’తో హీరోయిన్‌గా జోరు మొదలుపెట్టింది.

This browser does not support the video element.

ఈలోపు ‘యురేకా’, ‘అతరంగీ రే’ లాంటి సినిమాలు చేసినా కెరీర్‌ పట్టాలెక్కలేదు. ‘ఖిలాడీ’ ప్రచార చిత్రాల్లోనే డింపుల్‌ను చూసి గోపీచంద్‌ ‘రామబాణం’లో ఛాన్స్‌ ఇచ్చేశారు. 

‘రామబాణం’ ఫలితం ఇబ్బందికరంగా ఉండేసరికి మళ్లీ డింపుల్‌ డల్‌ అయ్యింది. అయితే ఇప్పుడిప్పుడే ఫొటో షూట్‌లు, వీడియోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. కొత్త సినిమాలు చర్చల దశలో ఉన్నాయని చెబుతోంది.

విజయవాడలో పుట్టిన డింపుల్‌ హైదరాబాద్‌లో పెరిగింది. నాన్న తమిళ్ అయితే.. అమ్మ తెలుగు. దీంతో ఇటు తెలుగు, అటు తమిళంలో రాణించే పనిలో ఉంది.

ఈ బ్యూటీని తొలుత డింపుల్‌ అనే పిలిచేవారట. అయితే తన పేరుకు హయాతి చేరిస్తే బలం చేకూరుతుందనే నిపుణుల సలహాతో డింపుల్‌ హయాతిగా మారింది.

పదో తరగతి పూర్తవ్వగానే నటన మీద ఉన్న ఆసక్తితో మోడల్‌గా కెరియర్‌ని ప్రారంభించింది. కొన్ని యాడ్స్‌ కూడా చేసింది.

యాక్టింగ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాక ఎంతో మంది డైరెక్టర్లను కలిసిందట. మేని ఛాయ తక్కువగా ఉందనే కారణంతో తనను రిజక్ట్‌ చేశారని డింపుల్‌ ఓసారి చెప్పుకొచ్చింది.

నిజానికి 2017లో సునీల్‌కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన ‘గల్ఫ్‌’ డింపుల్‌కు తొలి చిత్రం. ఆ తర్వాత ‘అభినేత్రి 2’తో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ఆ సమయంలో హరీశ్‌ శంకర్‌ ఆమెను ‘గద్దలకొండ గణేష్‌’ ఐటమ్‌ సాంగ్‌కు తీసుకున్నారు. ఆ తర్వాత వరసగా అలాంటి అవకాశాలే వచ్చాయట. కానీ హీరోయిన్‌గా ఎదగాలనే ఆకాంక్షతో రిజక్ట్‌ చేసేశా అని చెప్పింది.

ధనుష్‌తో ‘అతరంగీ రే’ చేయడంతో మొత్తంగా తక్కువ సమయంలో ఇటు తెలుగు, తమిళ్‌.. అటు బాలీవుడ్‌ కూడా కవర్‌ చేసేసింది. ఇప్పుడు కెరియర్‌ను నిలబెట్టుకునే పనిలో ఉంది. 

This browser does not support the video element.

ఈ భామ ఫిట్‌నెస్‌ ఫ్రీ ఛాలెంజ్‌తో స్లిమ్‌గా ఉండేందుకు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది.


డింపుల్‌ ఫొటో షూట్స్‌లో.. ఎక్కువశాతం డార్క్‌ షేడ్‌ ఉన్న ఫొటోలకే ప్రాధాన్యం ఇస్తుంటుంది. తన ఇన్‌స్టా ఖాతాలో కూడా ఇవే ఎక్కువగా ఉంటాయి. 

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home