డింపుల్‌ బంపర్‌ గెలుపు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాద్‌ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్ యాదవ్‌ విజయం సాధించారు.

image:Instagram/RKC 

ఎస్పీ వ్యవస్థాపకుడు, మెయిన్‌పురి ఎంపీ ములాయం సింగ్‌ యాదవ్ మృతి చెందడంతో నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. 

image:Instagram/socialist_akhileshyadav

ఈ ఎన్నికలో 64 శాతం ఓటింగ్‌తో 6.17 లక్షల ఓట్లు సాధించారు డింపుల్‌. ప్రత్యర్థిపై 2.90లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

image:Instagram/RKC

మెయిన్‌పురిని ఎస్పీ కంచుకోటగా భావిస్తారు. ఆ స్థానంలో డింపుల్‌ గెలుపొంది ఆ మాటను రుజువు చేశారు.

image:Instagram/RKC 

నామినేషన్‌ వేసే క్రమంలో డింపుల్‌ తన ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌ సమర్పించారు. తనకు రూ. 14 కోట్ల విలువైన స్థిరచరాస్తులున్నట్లు తెలిపారు. ఇందులో 2.7 కిలోల బంగారం, రూ. 59 లక్షలు విలువ చేసే వజ్రాభరణాలున్నాయని పేర్కొన్నారు. 

image:Instagram/RKC 

డింపుల్‌.. 1978లో జనవరి 15న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. లఖ్‌నవూ యూనివర్సిటీలో కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 

image:Instagram/RKC 

ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

image:Instagram/socialist_akhileshyadav 

రాజకీయ కుటుంబం కావడంతో.. మొదటి నుంచి తన భర్త, మామ, కుటుంబసభ్యులకు మద్దతుగా ఉండేవారు. ఎన్నికల ప్రచారాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు.

image:Instagram/RKC 

తొలిసారి 2009లో ఫిరోజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ తరఫున డింపుల్‌ పోటీ చేశారు. కానీ, కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ బబ్బర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 

image:Instagram/RKC 

అఖిలేశ్‌ యాదవ్‌ 2012లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన కన్నౌజ్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో డింపుల్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

image:Instagram/RKC 

డింపుల్ యాదవ్‌ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్నౌజ్‌ నుంచి మళ్లీ పోటీ చేసి విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 

image:Instagram/socialist_akhileshyadav 

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

రెడ్‌ బ్యూటీ..

నేనే బొమ్మనైతే...

Eenadu.net Home