ధోనీ తర్వాత డీకేనే..!

క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ లీగ్‌లో పలు జట్లకు ప్రాతినిథ్యం వహించిన డీకే.. ఎన్నో రికార్డులు సాధించాడు. వాటిపై ఓ లుక్కేద్దాం..

ఐపీఎల్‌ కెరీర్‌లో డీకే 6 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. అవేంటంటే.. దిల్లీ, పంజాబ్‌, ముంబయి, గుజరాత్‌, కోల్‌కతా, బెంగళూరు. కోల్‌కతా జట్టు సభ్యుడిగా 1143, దిల్లీ ఆటగాడిగా 1036 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు (257) ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ కూడా 257 మ్యాచ్‌లతో సమంగా ఉన్నాడు. ధోనీ(264)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (174) తీసిన రెండో వికెట్‌ కీపర్‌ డీకేనే. వాటిలో 137 క్యాచ్‌లు, 37 స్టంప్స్‌ ఉన్నాయి. తొలి స్థానంలో ధోనీ(190 - 148 క్యాచ్‌లు, 42 స్టంప్స్‌)తో ఉన్నాడు. 

డీకే.. నాలుగు అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 4097 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక స్కోర్‌. 5047 పరుగులతో మొదటి స్థానం ధోనీదే.

ఐపీఎల్‌ డెత్‌ ఓవర్స్‌(17-20)లో అత్యధిక స్కోర్‌ చేసిన వారిలో డీకే(1565) మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ(2786), కీరన్‌ పొలార్డ్‌(1709) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 4842 పరుగులతో పదో స్థానంలో ఉన్నాడు. అదే వికెట్‌ కీపర్‌గా 4463 పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. తొలిస్థానంలో ఉన్నది.. ధోనీ(5125).

డీకే తన ఐపీఎల్‌ కెరీర్‌లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే తుది జట్టులో స్థానం కోల్పోయాడు. 2008లో కోల్‌కతాతో మ్యాచ్‌లో దిల్లీ అతడిని పక్కన పెట్టింది. 2023లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. కానీ, ఆడే అవకాశం రాలేదు. 

ఐపీఎల్‌లో అత్యధిక మంది ఆటగాళ్ల(187)తో మైదానాన్ని పంచుకున్న క్రికెటర్‌గా డీకే ముందున్నారు. ఆ తర్వాత స్థానంలో అజింక్య రహానె(168), శిఖర్‌ ధావన్‌(167) ఉన్నారు. ఎక్కువ జట్లకు ఆడటమే దీనికి కారణం. 

టీ20 ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్‌ రికార్డు

T20WC..విదేశీ జట్లలో మనోళ్లు!

భారత్ - పాక్‌ మ్యాచ్ రికార్డులివే..

Eenadu.net Home