చలిలో నాన్న నేను బైక్‌ రైడ్‌కి వెళ్తాం

తమిళ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితి‘భైరవం’తో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ‘అల్లరి పిల్ల’ వెన్నెలగా అలరించనుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. 

2022లో తమిళ పరిశ్రమలో ‘విరుమాన్‌’తో ఎంట్రీ ఇచ్చింది అదితి. ఈ సినిమాకి ‘వికటన్‌ అవార్డ్స్‌’, ‘సైమా’, ‘బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ ఐకాన్‌’, ‘ఫిల్మ్‌ ఫేర్‌’లోనూ బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌గా అవార్డులు అందుకుంది.

ఆ తర్వాత ‘మావీరన్‌’లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ‘నెసిప్పయా’, ‘వన్స్‌ మోర్‌’ షూటింగ్‌తో బిజీగా ఉంది.

అదితి నటి మాత్రమే కాదు.. ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా.. తెలుగులో ‘గని’కోసం ‘రోమియోకి జూలియెట్‌లా...’ పాట పాడింది. తమిళంలో మరో మూడు గీతాలను ఆలపించింది.

‘నాన్నతో సినిమా సెట్లకి వెళ్లినప్పుడు అగ్ర హీరోలను చూసేదాన్ని. అలా నటనపై ఆసక్తి కలిగింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడే.. నటిస్తాను అని నాన్నకు చెప్పినప్పుడు ఆయన ఓ షరతు పెట్టారు. - అదితి

‘నీకు ఓ సంవత్సరం సమయం ఇస్తా. నా కూతురిగా కాకుండా సొంతగా ప్రయత్నించు. అవకాశాలు రాకపోతే మరెప్పుడూ సినిమా మాటే ఎత్తొద్దు’ అని తన తండ్రి అన్నారని అదితి తెలిపింది.

శంకర్‌ తెలుగులోనూ మాట్లాడుతుంటారు. తండ్రి దగ్గర తెలుగు నేర్చుకొని టాలీవుడ్‌ సినిమాలు చూడటం అలవాటు చేసుకుంది అదితి.

ప్రస్తుతం డాక్టర్‌గా కొనసాగుతూనే.. చిత్ర పరిశ్రమలోనూ వరుస అవకాశాలతో రాణిస్తోంది. 

నాన్నతో కలిసి బైక్‌ రైడింగ్‌ ఇష్టం. చలికాలంలో ఇద్దరూ కలిసి పొద్దున్నే బైక్‌పై చక్కర్లు కొడుతుంటారు.

ట్రిప్‌కి వెళ్తే మంచు ఉండే ప్రదేశాలనే ఎంచుకుంటుంది. ఐస్‌తో ఆటలు ఆడుతుంటే సమయమే తెలియదు అని చెప్పింది.

అదితికి డ్యాన్స్‌ చేయడం ఇష్టం. మాస్‌ బీట్‌ వినగానే ఆటోమేటిక్‌గా కాలు కదిపి స్టెప్పులేసేస్తాను అంటోంది.  

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home