డైరెక్టర్లు - హీరోలు.. హ్యాట్రిక్ దాటేస్తున్నారు..!
ఒకప్పుడు ఒక్కో దర్శకుడు ఒక్కో హీరోతో పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అయినా.. కొందరు దర్శకులు మాత్రం తమ లక్కీ హీరోతో హ్యాట్రిక్‌కు మించి సినిమాలు చేస్తున్నారు. వారెవరంటే..
#Eenadu
త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వచ్చాయి. మూడూ మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ 22 వ చిత్రం కోసం నాలుగోసారి వీరిద్దరూ కలసి పనిచేయబోతున్నారు.
#Eenadu
రవితేజతో గోపిచంద్ మలినేని తీసిన ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. రవితేజ-గోపీచంద్ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనుంది.
#Eenadu
బోయపాటి శ్రీను - బాలయ్య కాంబోకి భలే క్రేజ్ ఉంది. ఈ నందమూరి నటసింహాన్ని తెరపై ఎలా చూపించాలో బోయపాటికి బాగా తెలుసు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’తో ఆ విషయాన్ని నిరూపించాడు. మరోసారి ఈ డైనమిక్ డైరెక్టర్.. బాలయ్యతో ఓ సినిమా చేయనున్నాడు.
#Eenadu
ఎస్.ఎస్.రాజమౌళి-ఎన్టీఆర్ గతంలో ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలు చేశారు. ప్రస్తుతం పాన్‌ఇండియా చిత్రాలతో వీరిద్దరూ బిజీగా ఉండగా.. ఆయా చిత్రాలు పూర్తికాగానే మరోసారి SSR-NTR కాంబోలో ఓ సినిమా ఉండనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
#Eenadu
ప్రభాస్‌తో ఎస్.ఎస్. రాజమౌళి ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ సినిమాలు తెరకెక్కించారు. మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇరువురి కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత కచ్చితంగా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తారని తెలుస్తోంది.
#Eenadu
డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడోరకం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రాలు చేశాడు. ఇటీవల విడుదలైన ‘జిన్నా’కు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించలేదు గానీ, కథను అందించాడు. ‘ఈడోరకం ఆడోరకం 2’కి కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్.
#Eenadu
పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ తెరకెక్కించాడు. పవన్ ‘భీమ్లా నాయక్’కి మాత్రం డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందించాడు.
#Eenadu
‘కార్తికేయ’తో హీరో నిఖిల్‌కి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన చందూ మొండేటి.. ఆ సినిమా సిరీస్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ‘కార్తికేయ 2’ విడుదల కాగా.. ‘కార్తికేయ 3’ తెరకెక్కనుంది. ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘కిరాక్ పార్టీ’ చిత్రాలకు చందూ రచయితగా పనిచేశాడు.
#Eenadu
కోలీవుడ్ విషయానికొస్తే.. సూర్యతో ‘ఆరు’, ‘దేవా’ తర్వాత దర్శకుడు హరి.. ‘సింగం’ సిరీస్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. సింగం 1,2,3 మంచి విజయాల్ని అందుకున్నాయి. మరో సీక్వెల్ త్వరలో పట్టాలెక్కనుంది.
#Eenadu
తమిళ దర్శకుడు శివ.. స్టార్ హీరో అజిత్ కలిసి ఆరేళ్లలో నాలుగు సినిమాలు చేశారు. అజిత్ నటించిన ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’ ‘విశ్వాసం’ చిత్రాలకు శివ దర్శకత్వం వహించాడు.
#Eenadu