ఫస్టు సినిమానే హిట్టు!

మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు సినిమాలు తీసి.. మొదటి ప్రయత్నంలోనే హిట్టు కొట్టారు కొందరు నవతరం దర్శకులు. రీసెంట్‌ విజయం అందుకున్న ఆ సినిమాలేంటి, ఆ దర్శకులెవరో చూద్దామా!

‘ఆయ్‌’తో తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు అంజి కె. మణిపుత్ర. గోదావరి నేపథ్యంలో సాగిన ఈ సినిమా కొత్త ఫీల్‌ని అందించింది.

‘కమిటీ కుర్రోళ్లు’తో యదువంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథ నాటి రోజుల్ని గుర్తు చేసింది.

టిపికల్‌ సబ్జెక్ట్‌ను తీసుకొని.. సులభంగా అర్థమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు. కానీ ‘హాయ్‌ నాన్న’తో శౌర్యువ్‌ చేసి చూపించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లే వచ్చాయి.

తొలి సినిమాతోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు అంటే మామూలు మాటలా.. ‘దసరా’తో ఆ పని చేసి చూపించారు శ్రీకాంత్‌ ఓదెల. నానితో ఇప్పుడు మరో సినిమా కూడా చేస్తున్నారు. 

కమెడియన్‌ వేణు వెల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘బలగం’. ఈ సినిమా విజయానికి నిదర్శనం కావాలంటే తెలంగాణలోని ఊళ్లలో టెంట్లు వేసి, తెరలు వేసి సినిమా చూశారు అని చెప్పాల్సి వస్తుంది.

‘మ్యాడ్‌’తో తొలి ప్రయత్నంలో హిట్టు కొట్టారు దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ‘చిన్న సినిమాకు పెద్ద విజయం’ అనే మాటకు నిదర్శనం.

 కార్తీక్‌ దండు తొలి చిత్రం ‘విరూపాక్ష’ విజయమూ ప్రత్యేకమే. చాలామంది ప్రయత్నించిన హారర్‌ థ్రిల్లర్‌ అయినా.. సినిమా నడిపిన విధానం అందరికీ నచ్చింది.

అంజలి వేశ్యగా నటించిన ‘బహిష్కరణ’కు దర్శకత్వం వహించిన ముఖేష్‌ ప్రజాపతి కూడా డెబ్యూ దర్శకుడే. ఓటీటీలో వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌ హిట్‌ కొట్టింది.

రవీనా టాండన్‌ వారసురాలు.. భలే చలాకీ!

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

Eenadu.net Home