దర్శకులు నటులై.. నటులు దర్శకులై
కేవీ అనుదీప్
‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. థియేటర్లలో ప్రస్తుతం సందడి చేస్తున్న ‘మ్యాడ్’లో ఓ పాత్ర పోషించారు.
శ్రీకాంత్ అడ్డాల
‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తదితర చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెదకాపు 1’లో నెగెటివ్ ఛాయలున్న పాత్రలో నటించారు.
ఎస్.జె. సూర్య
పవన్ కల్యాణ్ ‘ఖుషి’తో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.జె. సూర్య. ‘స్పైడర్’, ‘ది లూప్’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఈయన ‘మార్క్ ఆంటోని’తో కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల్ని పలకరించారు. ‘గేమ్ ఛేంజర్’, ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నటిస్తున్నారు.
సముద్రఖని
‘శంభో శివ శంభో’, ‘బ్రో’వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ‘సర్కారువారి పాట’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ తదితర హిట్ చిత్రాల్లో నటించారు. ‘భారతీయుడు 2’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.
గౌతమ్ వాసుదేవ్ మేనన్
‘ఏమాయ చేసావె’, ‘ఘర్షణ’వంటి సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ గౌతమ్ మేనన్. ‘సీతారామం’, ‘మైఖేల్’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించారు. త్వరలో విడుదల కానున్న ‘లియో’లో కీ రోల్ ప్లే చేశారు.
కరుణ కుమార్
‘పలాస 1978’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు కరుణ కుమార్. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో తొలిసారి తెరపై కనిపించిన ఆయన ‘నా సామిరంగ’ లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
రాఘవేంద్రరావు
దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’తో తొలిసారి తెరపైకి వచ్చారు.
రిషబ్ శెట్టి
‘కాంతార’తో అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా సంచలనంగా మారారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ‘కాంతార 2’ పనుల్లో బిజీగా ఉన్నారు.
విశ్వక్ సేన్
‘వెళ్లిపోమాకే’, ‘ఈ నగరానికి ఏమైంది?’.. ఈ రెండు చిత్రాలతో హీరోగా అనుభవం గడించిన విశ్వక్‌సేన్ మూడో సినిమాకే దర్శకత్వం వహించారు. అదే ‘ఫలక్‌నుమా దాస్’. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన మరో చిత్రం ‘దాస్ కా ధమ్కీ’.
వేణు యెల్దండి
కమెడియన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు యెల్దండి. ఈయన తెరకెక్కించిన ‘బలగం’ ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే.
అవసరాల శ్రీనివాస్
నటుడిగా అవసరాల శ్రీనివాస్ ‘అష్టా చమ్మా’, ‘ఆరెంజ్’, ‘పిల్ల జమీందార్’ తదితర సినిమాల్లో కనిపించారు. దర్శకుడిగా ‘ఊహలు గుసగుసలాడే’ కోసం మెగాఫోన్ పట్టారు. డైరెక్టర్‌గా ఈయన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.