బీచ్, బాడీ, బీట్.. దిశ రూట్!
బాలీవుడ్ క్రేజీ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న దిశా పటానీ.. హాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది.
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ నటుడు టైరీస్ గిడ్సన్‌కు జంటగా నటించనుంది దిశ. ఈ సిరీస్ షూటింగ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దిశ 2013లో ‘పాండ్స్ మిస్ ఇండియా ఇందౌర్’ రన్నరప్‌గా నిలిచింది. 2015లో ‘లోఫర్’ ద్వారా హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.
ఆ తర్వాత తొమ్మిదేళ్లకి ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’తో మరోసారి టాలీవుడ్‌లో మెరిసింది. ఇటీవల సూర్య ‘కంగువ’తో తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.
‘ఎమ్. ఎస్. ధోని..’, ‘బాగీ 2’, ‘బాగీ 3’, ‘రాధే’, ‘మలంగ్’, ‘భారత్’ వంటి చిత్రాలతో అలరించింది.
రీసెంట్ హీరోయిన్లలో చైనా సినిమా ‘కుంగ్‌ఫూ యోగా’లో నటించిన హీరోయిన్ ఈమెనే.
దిశాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఖాళీ సమయం దొరికితే డ్యాన్స్ ప్రాక్టీసుకే కేటాయిస్తుంది.
ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువగా శ్రమిస్తుంది. మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వంటివి చేస్తుంది.
బీచ్‌లో గడపడం అంటే ఇష్టం. నదులు, జలపాతాలు, సముద్రాల వంటి ప్రదేశాలకే టూర్‌లకి ఎక్కువగా వెళుతుంది.
పెంపుడు జంతువులంటే ఇష్టం. శునకాలు, పిల్లులు, గుర్రాలను కూడా పెంచుకుంటుంది.
ప్రముఖ మ్యాగజైన్ల కవర్ ఫొటోలకు తరచుగా పోజులిస్తుంది. ఈమె ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 6.15 కోట్లు.
ఇన్‌స్టాలో దిశా పటానీ పెద్దగా మాట్లాడదు. కేవలం ఎమోజీలతో తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయినా ఆమెకు ఫాలోవర్లు భారీగానే ఉన్నారు.
నటి మౌనీ రాయ్, దిశ మంచి స్నేహితులు. ఇద్దరూ కలసి జాలీ ట్రిప్‌లకు తెగ వెళ్తుంటారు.
సింగిల్స్‌లో దిశ డ్యాన్స్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.. ‘బేఫిక్రా’, ‘హర్ ఘూంట్ మే స్వాగ్’, ‘క్యూ కరూ ఫికర్’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది.
This browser does not support the video element.
బాస్కెట్ బాల్ ఆడడం, చూడడం రెండూ ఇష్టమే. మ్యాచ్ సమయంలో స్నేహితులతో కలిసి స్టేడియంలో సందడి చేస్తుంది..