దుబాయ్‌ టు టాలీవుడ్.. వయా మాలీవుడ్‌!

‘తగ్గేదే లే’తో తెలుగు తెరకు పరిచయమైన దివ్య పిళ్లై.. ‘భైరవం’లో పూర్ణిమగా ప్రేక్షకుల్ని అలరించనుంది. 

తెలుగు, తమిళ, మలయాళంలో వివిధ చిత్రాల్లో నటించిన దివ్య, 2015లో ‘అయల్‌ జనల్ల’తో మలయాళ వెండితెరకు పరిచయమైంది.

దుబాయ్‌లో పుట్టి పెరిగిన దివ్య పిళ్లై.. ఫ్లై దుబాయ్‌లో ఉద్యోగం చేసేది. సినిమాలపై ఇష్టంతో ఇండియా వచ్చిన తొలిరోజుల్లో మోడలింగ్ చేసింది. 

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ‘ది విలేజ్‌’,‘మాస్టర్ శాంతి’,‘జీపీ కథలు’ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి అభిమానుల్ని అలరిస్తోంది. 

సినిమాల నుంచి విరామం దొరికితే.. ఫ్రెండ్స్‌తో కలసి కార్‌లో ఘాట్‌ రోడ్డులో షికార్లు కొడుతూ ప్రకృతిలో సేద తీరాల్సిందే.. అని చెప్పింది.

దివ్య పిళ్లై జంతు ప్రేమికురాలు.. ఖాళీ సమయాల్లో బైక్‌రైడ్‌ చేస్తూ వీధి కుక్కలకు ఆహారం పెడుతుంది.

ఇంట్లో బ్లూబెర్రీ, డ్రైఫ్రూట్స్‌తో చేసిన యోగర్ట్‌ను ఎంజాయ్‌ చేస్తా అని చెప్పింది.

టెరస్‌పై మొక్కలు పెంచడమంటే ఆసక్తి ఎక్కువ. తండ్రితో కలసి వాటి సంరక్షణ చూస్తుంది. 

ఇరాక్‌ మూలాలున్న బ్రిటిష్‌ వ్యక్తితో 12 ఏళ్లు రిలేషన్‌షిప్‌లో ఉండి, వివిధ కారణాల వల్ల దూరమయ్యారు.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home