ఉదయాన్నే ఇవి చేస్తే ఆరోగ్యం.. మీ సొంతం!
ఉదయం.. నిద్ర మత్తు అంత తొందరగా వదలదు. లేవగానే బెడ్‌షీట్ సర్దినా లేదా మరో పనిలో పడినా మత్తు వదిలిపోతుంది.
Image: Unsplash
లేవగానే చాలా మంది మొబైల్‌కు అతుక్కుపోతారు. దీని వల్ల సమయం వృథా. కాబట్టి ఉదయం మొబైల్‌కి దూరంగా ఉండండి.
Image: Unsplash
ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగండి. దీంతో మీకు కొంత శక్తి లభిస్తుంది. శరీరంలో జీవక్రియలు ఉత్తేజితమవుతాయి.
Image: Unsplash
కాసేపు ధ్యానం చేయండి. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మక ఆలోచనలు వస్తాయి.
Image: Unsplash
పుస్తకం చదవండి లేదా వ్యాసం రాయండి. ఈ రెండు పనులు మీ మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సానుకూల దృక్పథాన్ని కల్పించడంతోపాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది.
Image: Unsplash
వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్తేజితంగా మారి.. రోజంతా అలాగే కొనసాగేలా చేస్తుంది. శారీరక, మానసిక అనారోగ్యాలు దరిచేరవు.
Image: Unsplash
శరీరానికి డి విటమిన్ చాలా అవసరం దీని కోసం రోజూ ఉదయం కాసేపు సూర్యరశ్మి తగిలేలా ఎండలో నిలబడాలి.
Image: Unsplash
ఉదయం అల్పాహారం విషయంలో జాగ్రత్త వహించాలి. జంక్‌ఫుడ్ కాకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తింటే మంచిది.
Image: Unsplash
ఉదయాన్నే మీ రోజువారీ పనుల జాబితా రూపొందించుకుంటే పనులన్నీ సులువుగా పూర్తి చేసుకోవచ్చు.
Image: Unsplash