అత్యవసర నిధి సమకూర్చుకున్నారా?

ఆర్థికంగా బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైనా గడ్డు పరిస్థితి ఎదురై ఆర్థిక కష్టాలు చుట్టుముడితే?

Image: RKC

ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే.. ఆదాయం ఉన్నప్పుడు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే బ్యాంక్‌గా ఉపయోగపడుతుంది.

Image: RKC

అత్యవసరాలు అంటే..

ఉపాధి కోల్పోయినప్పుడు ప్రతి నెలా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అత్యవసర నిధి ఆదుకుంటుంది. అప్పు చేయాల్సిన పరిస్థితి రానివ్వదు. 

Image: RKC

వైద్యపరమైన ఖర్చులు, ఇంట్లో అనుకోని కార్యాలు, మరమ్మతులు తదితర అవసరాలకూ ఈ అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. 

Image: RKC

డబ్బు ఎంత కేటాయించాలి?

పరిస్థితిని బట్టి ఖర్చులుంటాయి. కాబట్టి.. కనీసం మీ ఆరు నెలల వేతనానికి సమానమైన మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. 

Image: RKC

దీని వల్ల ఆదాయం లేనప్పుడు నెలవారీ ఇంటి ఖర్చులకు(ఇంటి అద్దె, సరకులు, పిల్లల చదువు ఫీజులు తదితర) ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Image: RKC

ఎక్కడ దాచాలి?

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు తొందరగా చేతికొచ్చేలా ఉండాలి. కాబట్టి.. తక్కువ వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, తొందరగా ఉపసంహరించుకునే వీలున్న లిక్విడ్‌ ఫండ్లలో డబ్బును పెట్టుబడిగా పెట్టొచ్చు. 

Image: RKC

ఇంట్లో కనీసం 10-15 రోజుల ఖర్చులకు సరిపడా డబ్బును ఉంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఇంట్లో ఉంటే అనవసర ఖర్చులు చేసే అవకాశముంది.

Image: RKC

నిధి ఖాళీ అయితే?

అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బును ఖర్చు చేస్తే.. మళ్లీ నిధి ఏర్పాటు ప్రారంభించాలి. ఎప్పటికీ అత్యవసర నిధి ఉండేలా చూసుకోవాలి.

Image: RKC

బడ్డెట్‌ ప్లాన్‌ చేద్దామిలా!

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

పన్నుప్రయోజనాలు అందించే పథకాలు ఇవే..

Eenadu.net Home