సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?
డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో సైబర్ మోసాలూ ఎక్కువయ్యాయి. దీంతో ఆరోగ్య/జీవిత బీమాలాగే.. సైబర్ బీమా కూడా తప్పనిసరి అవుతోంది.
Image: RKC
సైబర్ బీమా తీసుకుంటే.. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ర్యాన్‌సమ్‌వేర్, సైబర్ బుల్లీయింగ్, మాల్వేర్ ఇంట్రుజన్, డేటా ఫిషింగ్ వంటి సైబర్ దాడుల నుంచి రక్షణ లభిస్తుంది.
Image: RKC
సైబర్ మోసానికి గురైనప్పుడు నిబంధనల ప్రకారం పాలసీలో పేర్కొన్న హామీని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సైబర్ మోసంపై దర్యాప్తు, ఫోరెన్సిక్, డేటా రికవరీ, ఐటీ కన్సల్టెన్సీ సర్వీసు ఛార్జీలు, కోర్టు ఖర్చులను భరిస్తాయి.
Image: RKC
సైబర్ దాడుల వల్ల బాధితులు తీవ్ర మనోవేదనకు గురైతే.. మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌కు అయ్యే ఖర్చు కూడా ఈ బీమా కిందకి వస్తుంది.
Image: RKC
కొన్ని సందర్భాల్లో నష్టం పూర్తిగా తిరిగి రానప్పటికీ.. తీవ్రత మాత్రం తగ్గించుకునే అవకాశం సైబర్ బీమాతో ఉంటుంది.
Image: RKC
నిర్లక్ష్యపూరిత వైఖరి, అపరిచిత వ్యక్తులకు కీలక సమాచారాన్ని అందజేయడం, అనధీకృతంగా డేటాను యాక్సెస్ చేయడం వల్ల జరిగే మోసాలకు ఈ బీమా వర్తించదు.
Image: RKC
బజాజ్ అలయన్జ్, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఫ్యూచర్ జనరల్, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటి పలు సంస్థలు సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి.
Image: RKC
రూ.లక్ష వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రీమియం రూ.700 నుంచి రూ.2వేల వరకూ ఉంటుంది. పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం పెరుగుతుంటుంది.
Image: RKC
వ్యక్తిగతంగానే కాకుండా.. జీవిత భాగస్వామి, పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులకు కూడా టాప్-అప్ చేయించుకోవచ్చు. లేదా కుటుంబం మొత్తానికీ కలిపి ఫ్లోటర్ కవర్ తీసుకోవచ్చు.
Image: RKC
సైబర్ మోసం జరిగిందని గుర్తించిన 14 రోజుల్లోగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు.
Image: RKC