డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలివీ..!
మధుమేహం అదుపులో లేకపోతే ఎన్నో రుగ్మతలకు కారణమవుతుంది. అందులో ఒకటి డయాబెటిక్ న్యూరోపతి..దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
image:RKC
కాళ్లు, చేతుల నరాలు దెబ్బతింటాయి. పాదాల్లో జలదరింపు, అసౌకర్యంగా ఉంటుంది.
image:RKC
గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, జననేంద్రియాలపై ప్రభావం చూపిస్తుంది.
image:RKC
వికారం, అజీర్ణం, వాంతులతో ఇబ్బంది పడుతారు. ఏం తిన్నా వాంతి చేసుకోవాలనిపిస్తుంది.
image:RKC
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. నడిచేటప్పుడు కాళ్లు తడబడుతాయి. తూలుతున్నట్లుగా అనిపిస్తుంది.
image:RKC
రాత్రివేళ పాదాలలో మంటగా ఉంటుంది. నిద్ర పట్టదు. చల్లని నీళ్లు కాళ్లపై పోసుకోవాలనే భావన కలుగుతుంది.
image:RKC
విరేచనాలు కావొచ్చు. కొన్నిసార్లు మలబద్ధకం కూడా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
image:RKC
అధికంగా చెమటలు పడతాయి. కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది. కండరాలు బలహీనపడ్డట్టుగా ఉంటాయి.
image:RKC
యోని పొడిగా ఉండి.. భార్యాభర్తలు కలుసుకున్నపుడు ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలు శృంగారం పట్ల ఆసక్తి చూపించరు. ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
image:RKC
మూత్రాశయ సంబంధ సమస్యలు వస్తాయి. హృదయ స్పందనలు పెరుగుతాయి. గుండె దడగా అనిపిస్తుంది.
image:RKC