డయాబెటిక్‌ న్యూరోపతి లక్షణాలివీ..!

మధుమేహం అదుపులో లేకపోతే ఎన్నో రుగ్మతలకు కారణమవుతుంది. అందులో ఒకటి డయాబెటిక్‌ న్యూరోపతి..దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

image:RKC

కాళ్లు, చేతుల నరాలు దెబ్బతింటాయి. పాదాల్లో జలదరింపు, అసౌకర్యంగా ఉంటుంది.

image:RKC

గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, జననేంద్రియాలపై ప్రభావం చూపిస్తుంది.

image:RKC

వికారం, అజీర్ణం, వాంతులతో ఇబ్బంది పడుతారు. ఏం తిన్నా వాంతి చేసుకోవాలనిపిస్తుంది.

image:RKC

కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తాయి. నడిచేటప్పుడు కాళ్లు తడబడుతాయి. తూలుతున్నట్లుగా అనిపిస్తుంది.

image:RKC

రాత్రివేళ పాదాలలో మంటగా ఉంటుంది. నిద్ర పట్టదు. చల్లని నీళ్లు కాళ్లపై పోసుకోవాలనే భావన కలుగుతుంది.

image:RKC

విరేచనాలు కావొచ్చు. కొన్నిసార్లు మలబద్ధకం కూడా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

image:RKC

అధికంగా చెమటలు పడతాయి. కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది. కండరాలు బలహీనపడ్డట్టుగా ఉంటాయి.

image:RKC

యోని పొడిగా ఉండి.. భార్యాభర్తలు కలుసుకున్నపుడు ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలు శృంగారం పట్ల ఆసక్తి చూపించరు. ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

image:RKC

మూత్రాశయ సంబంధ సమస్యలు వస్తాయి. హృదయ స్పందనలు పెరుగుతాయి. గుండె దడగా అనిపిస్తుంది.

image:RKC

తీపి తినాలన్న కోరిక ఇందుకేనట..!

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

Eenadu.net Home