అందాల రాశీ.. దిగంగన సూర్యవంశీ..!

కార్తికేయ ‘హిప్పి’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది దిగంగన సూర్యవంశీ. ప్రస్తుతం ‘కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’తో అలరించనుంది.

వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్‌ హీరో. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

This browser does not support the video element.

దిగంగన విషయానికొస్తే ఈమె పుట్టింది.. ముంబయి(1997)లో. చదివిందీ.. అక్కడే. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసింది.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా హిందీలో పలు సీరియల్స్‌లో కనిపించింది. ‘ఏక్‌ వీర్‌ కీ అర్దాస్‌.. వీర’ అనే సీరియల్‌తో ఫేమస్‌ అయ్యింది.

‘ఫ్రైడే’తో బాలీవుడ్‌కి పరిచయమై ‘జిలేబి’ ,‘హిప్పి’, ‘ధనుసు రాసి నెయార్గాలే’, ‘వలయం’, ‘సీటీమార్‌’, ‘క్రేజీ ఫెలో’ తదితర తెలుగు, తమిళ చిత్రాలతో అలరించింది.

ఈమె నటి మాత్రమే కాదు రచయిత కూడా.. ‘వేవ్స్‌: ద ఎండ్లెస్‌ ఎమోషన్స్‌’ అనే పుస్తకాన్ని రచించింది. హ్యారీ పోటర్‌ సిరీస్‌ అంటే తనకి ఎంతో ఇష్టమట.

ఈ బ్యూటీకి చిన్నప్పట్నుంచీ జర్నలిస్ట్‌ అవ్వాలనే కోరిక ఉండేదట. అనుకోకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని ఓ సందర్భంలో తెలిపింది.

దిగంగనకి విహార యాత్రలంటే అమితమైన ఇష్టం. జమ్ముకశ్మీర్, లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతాలకు వెళ్లడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందట. 

‘అందుబాటులో ఫాస్ట్‌ఫుడ్‌ ఉంటే చాలు నేను సంతోషంగా ఉన్నట్టే.. పిజ్జా, పాస్తా, కేకులు, రస్‌మలై అంటే బాగా ఇష్టం’ అంటుందీ బ్యూటీ.

ఈమెకి భక్తి కూడా ఎక్కువే. తరచూ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతుంటుంది.

This browser does not support the video element.

ఫొటోషూట్లంటే ఇష్టపడే ఈ భామ గ్లామరస్‌ పోజులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంది. ఈమెకు ఫాలోవర్లు 10లక్షలకు పైనే ఉన్నారు.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home