అష్ట మహాదానాలు ఏవి?

నువ్వులు


నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలుంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి.

Source: Pixabay

ఇనుము


ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా వుండవచ్చని శాస్త్రం తెలుపుతోంది. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించివుంటారు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరు.

Source: Pixabay

బంగారం


సువర్ణదానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది.

Source: Pixabay

పత్తి


పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భ‌యం ఉండ‌దు.

Source: Pixabay

ఉప్పు 


ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. చావు భయం ఉండదు.

Source: Pixabay

భూమి


భూమిని దానం చేయడం ద్వారా సమస్తభూతాలు సంతృప్తి చెందుతాయి. సుఖఃసంతోషాలు కలుగుతాయి.

Source: Pixabay

గోవు


గోదానంతో వైతరిణి నదిని సులభంగా దాటిపోవచ్చు.

Source: Pixabay

ఏడు రకాల ధాన్యాలు


ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలు (గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు) దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా వుండేవారు ఆనందిస్తారు.

Source: Pixabay

వ్యక్తిత్వ వికాసానికి గురునానక్‌ సూక్తులు

చాణక్య చెప్పిన నీతి వాక్యాలు

భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ హిందూ ఆలయాలున్నాయి..!

Eenadu.net Home