మ్యాక్స్‌వెల్‌ డైట్‌ గురించి తెలుసా?

వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై డబుల్‌ సెంచరీ(201*) చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. ఇలాంటి సూపర్‌ నాక్‌ ఆడాలంటే.. ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. 

ప్రదర్శన బాగుండాలంటే శరీరం ఫిట్‌గా ఉండాలి. అందుకోసం కార్బోహైడ్రేట్లు, కెలోరీలు తక్కువగా ఉండే డైట్‌ను ఫాలో అవుతానని మ్యాక్స్‌ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి అలాంటి డైట్‌లో ఏ ఆహారం తీసుకోవచ్చో తెలుసా?

మటన్‌, చికెన్‌ బ్రెస్ట్‌, పోర్క్‌లో కార్బోహైడ్రేట్లు, కెలోరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తింటే ఫ్యాట్‌ పెరగకుండా శక్తి లభిస్తుంది. 

టూనా, సాల్మన్‌, అంచువీజ్‌ రకం చేపల్లో కెలోరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో లభించే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 

ఆకుకూరల్లోనూ పిండిపదార్థాలు, కెలోరీలు చాలా తక్కువ. పోషకాలు మెండు. అందుకే, ఈ డైట్‌ ఫాలో అయ్యేవారు.. తప్పకుండా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. 

కాలానుగుణంగా వచ్చే పండ్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వాటిలో ముఖ్యంగా యాపిల్‌, బ్లూబెర్రీస్‌, స్ట్రాబెర్రీస్‌ ఈ డైట్‌కి బెస్ట్‌ ఫ్రూట్స్‌. 

జీడిపప్పు, బ్రెజిల్‌ నట్స్‌, వాల్‌నట్స్‌, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్‌లో ఇవి మోస్తారుగా ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి. 

సరైన ఆహారం తీసుకోకపోతే ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది. కానీ, భారత్‌కి వస్తే మాత్రం బటర్‌ చికెన్‌ విత్‌ నాన్‌, గులాబ్‌ జామూన్‌ తినకుండా వెళ్లలేను. వాటి రుచి ఆమోఘంగా ఉంటుందని మ్యాక్స్‌వెల్‌ ఓ సందర్భంలో చెప్పాడు.

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

Eenadu.net Home