ఫ్యాషన్‌ పాఠాలతో ఏడాది ₹3.7 కోట్లు

యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసి ఏడాదికి రూ. 3.7 కోట్లు సంపాదిస్తోంది సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కోమల్ పాండే. ఆమె గురించి ఆసక్తికర వివరాలు మీ కోసం.

Image: Instagram/Komal Pandey

ఫ్యాషన్‌ గురించి సోషల్‌మీడియా సలహాలు, సూచనలు ఇస్తూ.. ఇప్పుడు స్టార్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిపోయింది కోమల్‌ పాండే. 

Image: Instagram/Komal Pandey

ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ప్రమోషన్స్‌లో భాగం అవుతూ పేరుతోపాటు.. రూ. కోట్లల్లో సంపాదిస్తోంది. 

Image: Instagram/Komal Pandey

పాతికేళ్ల కోమల్‌ ఆస్తి విలువ సుమారు రూ. 30 కోట్లు అంటేనే ఆమె పేరూ, సంపాదన గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. 

Image: Instagram/Komal Pandey

దిల్లీకి చెందిన కోమల్‌ ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తితో 2015లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడే ‘ది కాలేజ్‌ కోట్యూర్‌’ పేరుతో ఫ్యాషన్‌ బ్లాగ్‌ మొదలుపెట్టింది.

Image: Instagram/Komal Pandey

ఉద్యోగం చేస్తూనే ఈ బ్లాగ్‌ ద్వారా ఫ్యాషన్‌ డిజిటల్‌ కంటెంట్‌ను రూపొందించేది. 2018లో ఉద్యోగం మానేసి పూర్తిగా డిజిటల్‌ కంటెంట్‌వైపు వచ్చేసింది.  

Image: Instagram/Komal Pandey

This browser does not support the video element.

కొత్త కొత్త దుస్తులను ధరించడం, వాటి గురించి వివరించడం.. అలాగే కొత్త ఫ్యాషన్స్‌ని ఎలా ధరించాలి లాంటి విషయాలను ఆసక్తికరంగా వీడియోల్లో వివరిస్తూ ఉంటుంది. 

Image: Instagram/Komal Pandey

ఇంట్లో ఉన్న దుస్తుల్ని భిన్నంగా మలచడం ఎలా? లాంటి యూజ్‌ఫుల్‌ టిప్స్‌ కూడా ఆమె ఛానల్‌లో చూడొచ్చు.

Image: Instagram/Komal Pandey

కోమల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.8 మిలియన్‌ ఫాలోవర్స్‌, యూట్యూబ్‌లో 1.28 మిలియన్‌ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. 

Image: Instagram/Komal Pandey

యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన కంటెంట్‌ వ్యూస్‌తోనే కోమల్‌ ఏటా రూ.3 కోట్లకుపైగా ఆదాయం పొందుతుందట.

Image: Instagram/Komal Pandey

కాస్మోపాలిటన్‌ బెస్ట్‌ ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌గా కోమల్‌ వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022) నిలిచింది.

Image: Instagram/Komal Pandey

ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ కవర్‌పేజీపై ఓసారి తళుక్కున మెరిసింది కోమల్‌. అలాగే గతంలో ఫోర్బ్స్‌ టాప్‌ డిజిటల్‌ స్టార్స్‌ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 

Image: Instagram/Komal Pandey

డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ సిద్ధార్థ్‌ బత్రాతో కోమల్‌ రిలేషన్‌లో ఉంది. ఆమె సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ చూస్తే వాళ్ల విహారయాత్రల వివరాలు కనిపిస్తాయి. ఈ మధ్యే దుబాయ్‌కి వెళ్లొచ్చారు కూడా.

Image: Instagram/Komal Pandey

2100 నాటికి కనుమరుగయ్యే నగరాలివీ!

ఈ నైపుణ్యాలు మీ సొంతమైతే.. కెరీర్‌లో తిరుగుండదు!

పాములే లేని దేశాల గురించి విన్నారా..!

Eenadu.net Home