భూలోక స్వర్గం.. అమృత్ ఉద్యాన్
ప్రపంచంలోని ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్‌ను ‘అమృత్ ఉద్యాన్’గా పేరు మార్చారు. దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..
source : twitter
జమ్మూకశ్మీర్‌లోని మొగల్ గార్డెన్, తాజ్‌మహల్ గార్డెన్‌లను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రపతి భవన్ మొగల్ గార్డెన్స్‌కు రూపకల్పన చేశారు.
source : twitter
సర్ ఎడ్విన్ లుటియన్స్ మొగల్ గార్డెన్స్ డిజైన్‌ను 1917లో రూపొందించారు. 1928-29 మధ్య కాలంలో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయింది. అప్పటి ఉద్యానశాఖ డైరెక్టర్ విలియం మూస్టోయి దానికి సహకారం అందించారు.
source : twitter
రాష్ట్రపతి భవన్ తరహాలోనే ఈ ఉద్యానంలో రెండు వైవిధ్యాలు కనిపిస్తాయి. మొగల్ గార్డెన్, బ్రిటిష్ గార్డెన్‌ల కలయికతో ఇది దర్శనమిస్తుంది. మెగల్ గార్డెన్స్‌ను రాష్ట్రపతి భవనం ఆత్మగా పిలుస్తుంటారు.
source : twitter
15 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యానంలో దాదాపు 159 రకాల రోజాపూలు పూస్తాయి. తులిప్, ప్రిములాస్ లాంటి పూల మొక్కలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో అవి వికసిస్తాయి.
source : twitter
జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల పేర్లతోనూ ఇక్కడ పూల మొక్కలున్నాయి. మదర్ థెరిసా, రాజా రామ్ మోహన్‌రాయ్, మిస్టర్ లింకన్, జాన్ ఎఫ్. కెన్నడీ, క్వీన్ ఎలిజబెత్.. మహాభారతంలోని పాత్రలతో అర్జున్, భీమ్ మొక్కలు ఇక్కడ దర్శనమిస్తాయి.
source : twitter
ఇక్కడ పెరిగే గడ్డిని దూబ్ గ్రాస్ అంటారు. దీనిని కొల్‌కతా నుంచి తెప్పించారు. దాదాపు 50 రకాల చెట్లను ఈ ఉద్యానంలో చూడొచ్చు. ఈ ఉద్యానవనం పర్యవేక్షణ చూడటానికి దాదాపు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
source : twitter
కేఆర్ నారాయణ్ హయాం నుంచి నేటి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వరకు అనేక మార్పులతో హెర్బల్,బోన్సాయ్, స్పిరుచ్యువల్, మ్యూజికల్, టెర్రాస్, మెయిన్ మొగల్, లాంగ్, సర్క్యులర్ గార్డెన్‌లను తీర్చిదిద్దారు.
source : twitter
అమృత్ ఉద్యాన్‌లో అడుగుపెట్టాలంటే ఎటువంటి ప్రవేశ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గేట్ నంబర్ 35 ద్వారా ఇందులోకి ప్రవేశం ఉంటుంది.
source : twitter
ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యానోత్సవం పేరిట పండగ నిర్వహిస్తారు. ఈ సారి జనవరి 31 నుంచి మార్చి 26 వరకు సందర్శకులను అనుమతించనున్నారు. ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొంటారు.
source : twitter
ఈ సుందరమైన ఉద్యానంలోకి ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు కాబట్టి సెల్ఫీలు తీసుకోవచ్చు. తిను బండారాలు, పాన్, గుట్కా, సిగరెట్స్, కెమెరాలను ఈ గార్డెన్‌లోకి అనుమతించరు.
source : twitter