సైకిల్ గురించి మీకివి తెలుసా?
జూన్ 3.. బైసైకిల్ డే..!
సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడం కోసం ఐరాస 2018 నుంచి జూన్ 3న అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని జరుపుతోంది.
image:Rkc
జర్మనీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి బేరన్ కర్ల్ వాన్ డ్రయిస్ 1817లో తొలిసారి సైకిల్‌ను తయారుచేసి ఉపయోగించారు.
image:Rkc
మొదట్లో వీటిని కలపతో తయారు చేసేవారు.. అవి తొందరగా విరిగిపోతుండటంతో ఐరన్‌తో చేయడం మొదలుపెట్టారు.
image:Rkc
సైకిల్‌పై వెళ్తే.. నడకకు మూడు రెట్లు వేగంగా ప్రయాణిస్తాం. నడకకు ఎంత శక్తి ఖర్చు అవుతుందో.. సైకిల్ తొక్కడానికీ అంతే శక్తి ఖర్చవుతుంది.
image:Rkc
ఒక్కో సైకిల్ ధర వాటి ఫీచర్స్‌ను బట్టి వేలల్లో ఉంటుంది. అత్యంత ఖరీదైన సైకిళ్లలో ఒకటి ‘ట్రెక్ బటర్‌ఫ్లై మెడన్’. దీని ధర 5లక్షల డాలర్లు(దాదాపు రూ. 4 కోట్లకుపైగా).
image:Rkc
సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కండరాలన్నీ బలపడతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలూ దరిచేరవు.
image:Rkc
శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. మెదడుకు కావాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందుతాయి.
image:Rkc
సైక్లింగ్ చేసేవారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట. ఎలాంటి పరిస్థితిలోలైనా ప్రశాంతంగా ఉండగలుగుతారట. ఉదయం పూట కాసేపు సైక్లింగ్ చేయడం వల్ల బద్దకం తొలగి.. రోజంతా హుషారుగా ఉంటారు.
image:Rkc
బైక్ నడపాలనుకునేవారు.. ముందుగా సైకిల్ తొక్కడం నేర్చుకుంటే.. బ్యాలెన్సింగ్ అలవాటైతుంది. ప్రమాదం జరిగినా తీవ్రంగా ఉండదు.
image:Rkc
బైక్ బదులు సైకిల్‌పై వెళ్తే కర్బన ఉద్గారాలను తగ్గించి.. పర్యావరణానికి మంచి చేసినట్లు అవుతుంది.
image:Rkc
ప్రపంచంలో అత్యధికంగా సైకిల్‌ను వినియోగించే దేశం నెదర్లాండ్స్. అక్కడ ప్రయాణాలకు వాహనాల కన్నా సైకిళ్లే ఎక్కువగా వినియోగిస్తారు.
image:Rkc