IRCTCలో ఈ విషయాలు తెలుసా?

దూర ప్రయాణం కోసం చాలా మంది ఐఆర్‌సీటీసీలో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేస్తుంటారు. కానీ, అందులో కొన్ని విషయాలు చాలా మందికి తెలీవు. అవేంటో చూసేద్దాం..

ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ ద్వారా గరిష్ఠంగా నెలకు 12 టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ వెరిఫైడ్ యూజర్లు మాత్రం 24 టికెట్లను బుక్‌ చేసుకొనే వీలుంది.

సాధారణ వేళల్లో ఒక పీఎన్‌ఆర్‌పై ఆరుగురి పేరుతో టికెట్లు బుక్‌ చేయొచ్చు. తత్కాల్ సమయంలో మాత్రం నలుగురి పేరు మీద మాత్రమే టికెట్‌ బుక్ చేయగలం.

ఐఆర్‌సీటీసీ ముందస్తు రిజర్వేషన్‌కు 120 రోజుల సమయం ఉండేది. దాన్ని 60 రోజులకు ఇటీవల తగ్గించారు. 2024 నవంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి.

60 ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు దాటిన స్త్రీలకు సీనియర్‌ సిటిజన్‌ కోటా కింద లోయర్‌ బెర్త్‌ టికెట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకేసారి రెండు కంటే ఎక్కువ టికెట్లు బుక్‌ చేయడానికి అవకాశం లేదు.

 పండగ వేళ నడిపే ప్రత్యేక రైళ్లు, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లలో సీనియర్‌ సిటిజన్‌ కోటా ఉండదు. రాజధాని, దురంతో వంటి రైళ్లలో కేవలం 3ఏసీ కోచ్‌లకు మాత్రమే పరిమితం.

ఐఆర్‌సీటీసీలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ట్రాన్సాక్షన్‌ హిస్టరీ దాదాపుగా చూపించదు. ఆ సమయంలో సర్వర్‌పై అధిక ఒత్తిడి ఉండడమే దీనికి కారణం.

రోజూ అర్ధరాత్రి 11:45 గంటల నుంచి మరుసటి రోజు 12:20 వరకు టికెట్‌ బుకింగ్‌లు చేయలేం. దాదాపు 35 నిమిషాల పాటు రోజూ ఈ సదుపాయం ఉండదన్నమాట.

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

Eenadu.net Home