ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

జాన్వీ కపూర్‌

లాస్‌ ఏంజెలెస్‌లోని ద లీ స్ట్రాబెర్గ్‌ థియేటర్‌& ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంది. థియేటర్ అండ్‌ ఫిల్మ్స్‌లో కోర్సు పూర్తి చేసింది.  

రష్మిక మందన

బెంగళూరులోని ఎమ్‌ఎస్‌ రామయ్య కాలేజీలో సైకాలజీతో పాటు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది.

సాయి పల్లవి

జార్జియాలో మెడిసిన్‌ పూర్తి చేసింది. చిత్ర పరిశ్రమలోకి రావడానికి ముందు కొద్ది రోజులు డాక్టర్‌గా ప్రాక్టీసు చేసింది.

శ్రీలీల

డాక్టర్‌ అవ్వాలని చిన్నప్పట్నుంచీ కలలు కన్న శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. 

నయనతార

తిరువళ్లలోని మార్‌ తోమా కాలేజీలో చదివింది. ఇంగ్లీషు లిటరేచర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది.

త్రిష

చెన్నైలో ఎతిరాజ్‌ కాలేజీ ఫర్‌ ఉమెన్‌లో బ్యాచిలర్ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.

అలియా భట్‌

ఇంటర్‌ సెకండియర్‌లో ఫెయిల్‌ అయింది. చదువు అక్కడితో ఆపేసింది.

కృతి శెట్టి

బెంగళూరు యూనివర్శిటీలో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

కియారా అడ్వాణి

ముంబయిలోని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌తో పాటు మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.

కృతి సనన్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీలో డిగ్రీ, నోయిడాలో ఎలక్ట్రానిక్స్‌ & టెలీకమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది.

సంయుక్త

కేరళలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

పూజా హెగ్డే

ముంబయిలోని ఎమ్‌ ఎమ్‌ కే కాలేజీలో కామర్స్‌లో మాస్టర్స్‌ చేసింది.

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home