నకిలీ ఉద్యోగాల వలలో చిక్కుకోవద్దంటే!
ఉద్యోగాలపేరిట యువతకు వల విసిరి కొందరు డబ్బులు గుంజుతుంటారు.
Source: Pixabay
ఉద్యోగార్థులు వీరికి చిక్కకుండా ఉండాలంటే కొన్ని విషయాలను గమనించాలి. అవేంటంటే..
Source: Pixabay
అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
Source: Pixabay
సోషల్‌మీడియా, ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Source: Pixabay
బ్యాక్‌డోర్ అంటూ కొందరు, ప్రభుత్వ రంగ ఉద్యోగులమంటూ మరికొందరు మోసగిస్తుంటారు. అవి నిజం కాదని గమనించాలి.
Source: Pixabay
కొన్ని నకిలీ కంపెనీలు ఆఫర్ లెటర్స్ కూడా పంపిస్తుంటాయి. అందులో సమాచారం సరిగా లేకపోయినా.. మెయిల్ ఐడీ వ్యక్తులది అనిపించినా అనుమానించాల్సిందే.
Source: Pixabay
ముందు డిపాజిట్ కట్టమని.. తర్వాత వర్క్ పంపుతాం అని చెప్పే డేటా ఎంట్రీ ఉద్యోగావకాశాలను నమ్మొద్దు.
Source: Pixabay
పెద్ద పెద్ద కంపెనీల పేర్లను వాడుతూ.. ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇచ్చేస్తామంటే ఆలోచించాలి.
Source: Pixabay
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామనే మాటలకు మోసపోవద్దు.
Source: Pixabay