వన్డేల్లో డబుల్‌ సెంచరీ ధమాకా!

వన్డేల్లో ద్విశతకం నమోదు చేయడం చాలా అరుదు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు పురుషుల వన్డే క్రికెట్‌లో ద్విశతకాలు చేసింది కేవలం 10 మందే. వారెవరంటే..

Image: Bcci

రోహిత్‌ శర్మ (264)

ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా శ్రీలంకతో 2014లో జరిగిన ఓ మ్యాచ్‌లో భారత ఓపెనర్‌, ప్రస్తుత టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విధ్వంసం సృష్టించాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సులతో 264 పరుగులు చేశాడు.

Image: Bcci

మార్టిన్‌ గఫ్తిల్‌ (237*)

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గఫ్తిల్‌ 2015లో వెస్టిండీస్‌పై చెలరేగి ఆడాడు. 163 బంతుల్లో 237 పరుగులు రాబట్టమే కాదు.. నాటౌట్‌గా నిలిచాడు. 

Image: Bcci

వీరేంద్ర సెహ్వాగ్‌ (219)

వెస్టిండీస్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. 2011లో ఇందౌర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు తీశాడు.

Image: Bcci

క్రిస్‌ గేల్‌ (215)

జింబాబ్వేతో 2015లో జరిగిన ఓ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ వీరవిహారం చేసి.. 147 బంతుల్లో 215 పరుగులు రాబట్టాడు.

Image: Bcci

ఫఖర్‌ జమాన్‌(210*)

పాకిస్థాన్‌కు చెందిన ఫఖర్‌ జమాన్‌ జింబాబ్వేపై డబుల్‌ సెంచరీ చేశాడు. 2018లో జరిగిన మ్యాచ్‌లో 156 బంతుల్లో 210 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

Image: Bcci

ఇషాన్‌ కిషన్‌ (210)

భారత్‌ తరఫున యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ కూడా ద్విశతకం సాధించాడు. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లో 210(24 ఫోర్లు, 10 సిక్సులు)పరుగులు తీశాడు. 

Image: Bcci

రోహిత్‌ శర్మ (209)

రోహిత్‌.. రెండో సారి ద్విశతకం చేసింది ఆస్ట్రేలియాపై. 2013లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 209(158 బంతుల్లో) స్కోర్‌ చేశాడు. 

Image: Bcci

రోహిత్‌ శర్మ (208*)

మూడో ద్విశతకం శ్రీలంకపై చేశాడు. 2017లో మొహాలీ వేదికగా లంకపై విరుచుకుపడ్డ రోహిత్‌ 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులతో 208 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Image: Bcci

శుభ్‌మన్‌ గిల్‌ (208)

తాజాగా ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్‌.. 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 9 సిక్సులున్నాయి.  

Image: Bcci

సచిన్‌ తెందూల్కర్‌ (200*)

దక్షిణాఫ్రికాతో 2010లో జరిగిన ఓ మ్యాచ్‌లో సచిన్‌ ద్విశతకం సాధించాడు. 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  

Image: Bcci

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home