అగ్ర హీరోలతో దుషారా

తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్‌.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.

ధనుష్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రాయన్‌’ చిత్రంలో హీరోకి చెల్లెలిగా కనిపించింది.

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, అనికా సురేంద్రన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నటించారు.

దుషారా విషయానికొస్తే.. 1997లో తమిళనాడులోని దిండిగల్‌లో పుట్టింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఆపై ఫ్యాషన్‌ స్టడీస్‌ని మధ్యలో ఆపేసి నటన వైపు అడుగులేసింది.

మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఈమె 2019లో ‘బొధై యెరి బుధి మారి’తో తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

ఆ తర్వాత ‘సార్పట్టా..’, ‘అన్‌బుల్లా ఘిల్లి’, ‘నచ్చాత్తిరమ్‌ నగరగిరాదు’, ‘కజువెతి మూరక్కన్‌’, ‘అనీతి’ వంటి చిత్రాలతో అలరించింది.

రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ చిత్రంలో నటిస్తోంది. దసరాకు ఈ సినిమా విడుదల కానుంది.

‘వీర ధీర సూరన్‌ 2’లో విక్రమ్‌కి జోడీగా నటిస్తోంది దుషారా. ఇలా అగ్ర హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తోందీ బ్యూటీ.

విహార యాత్రలకు వెళ్లడమంటే దుషారాకి మహా ఇష్టం. కొండలు, జలపాతాల్లో ప్రకృతిని ఆస్వాదించడం నచ్చుతుంది అంటోందీ బ్యూటీ. 

ఈమెకో ఫ్రెండ్స్‌ గ్యాంగే ఉంది. పార్టీలు, ఫంక్షన్లలో సందడి చేస్తుంది. వారితో కలిసి సరదాగా చేసిన రీల్స్‌ని ఇన్‌స్టాలో పంచుకుంటుంది.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home