ఆరోగ్యానికి ‘ఐసీఎంఆర్’ 8 సూత్రాలు!
మనిషి సహజ పద్ధతిలో ఆరోగ్యంగా ఉండటానికి ఈ 8 పద్ధతులు పాటించాలని తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేసింది. అవేంటంటే..
Image: Twitter
1. డైట్
మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. దీని ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండగలం. అనారోగ్యం దరిచేరదు.
Image: RKC
2. సన్‌షైన్
శరీరానికి.. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి విటమిన్ డి ఎంతో అవసరం అది ఎక్కువగా సూర్యరశ్మి ద్వారానే లభిస్తుంది. కాబట్టి రోజులో కాసేపు ఎండలో నిల్చోవాలి.
Image: RKC
3. ఎక్సర్‌సైజ్
శరీరం ఫిట్‌గా ఉండాలన్నా.. ఆరోగ్యంగా జీవించాలన్నా వ్యాయామం చేయడం తప్పనిసరి. రోజూ వ్యాయామం/యోగా/ధ్యానం చేయండి.
Image: RKC
4. పర్సనల్ హైజీన్
ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ముఖ్యం. ఇంటి విషయంలోనే కాదు, వ్యక్తిగతంగానూ శుభ్రత పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.
Image: RKC
5. ఎయిర్
రోజులో కాసేపు అయినా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. అప్పుడే శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి.
Image: RKC
6. రెస్ట్
శరీరానికి తగిన విశ్రాంతినివ్వాలి. అప్పుడే పనితీరు మెరుగవుతుంది. ఇందుకు రోజులో కనీసం 8 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి.
Image: RKC
7. వాటర్
శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే.. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. అప్పుడే చర్మం కూడా తేమతో ఉండి యవ్వనంగా కనిపిస్తారు.
Image: RKC
8. స్క్రీన్ టైం
ఈ కాలంలో టీవీలు, డిజిటల్ స్క్రీన్స్ చూడకుండా ఉండటం కష్టమే. కానీ, వీలైనంత తగ్గించుకుంటే మంచిది. మీ స్క్రీన్ టైం రోజులో 2-3 గంటలకు మించకుండా చూసుకోండి.
Image: RKC