ఈ అత్యవసర నంబర్లు తెలుసా!

అత్యవసర సమయంలోనూ.. ఆపత్కాలంలోనూ స్పందించే కొన్ని వ్యవస్థలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు టోల్‌ ఫ్రీ నంబర్లను ప్రకటించాయి. వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలుసుకోండి.

image:RKC

100..ఇది పోలీసులు పర్యవేక్షించే సంఖ్య. ఏ ఫోన్‌ నుంచి అయినా ఈ నంబరుకి ఫోన్‌ చేసి నేరాలు, సంఘటనల గురించి తెలియజేయవచ్చు.

image:RKC

101..అగ్ని ప్రమాదాలు జరిగినపుడు సమాచారం ఇవ్వొచ్చు. వెంటనే సిబ్బంది స్పందించి ఆస్తి, ప్రాణ నష్టాలను నివారిస్తారు.

image:RKC

108.. ఫోన్‌ చేస్తే ప్రమాదాలు జరిగినపుడు వైద్య సాయం అందించడానికి ఈ అంబులెన్సులను ఏర్పాటు చేశారు.

image:RKC

1110 మీ సేవ కాల్‌ సెంటరులో ఏదైనా సాయం కావాలన్నా ఫోన్‌ చేస్తే సమాచారం దొరుకుతుంది.

image:RKC

102.. ప్రభుత్వ అంబులెన్సు కావాల్సినపుడు ఈ నంబరుకి ఫోన్‌ చేయడానికి వీలుంది.

image:RKC

1091..మహిళలు అత్యవసర సమయంలో సాయం కోసం ఈ నంబరుకి ఫోన్‌ చేయొచ్చు.

image:RKC

1078..ప్రకృతి విపత్తుల సహాయ కేంద్రం నంబరు ఇది. ఈ నంబరుకి ఫోన్‌ చేస్తే తుపాన్‌, వరదలు వచ్చినపుడు అధికారులు సహాయం అందిస్తారు.

image:RKC

1097..ఎయిడ్స్‌ సంబంధిత వ్యాధులు వచ్చిన వారికి మందులు, ఇతర సహాయం అందుతుంది.

image:RKC

1094..పిల్లలు తప్పిపోయినపుడు ఈ సంఖ్యను ఆశ్రయించవచ్చు. దీన్ని డిప్యూటీ పోలీసు కమిషనర్‌ పర్యవేక్షిస్తారు.

image:RKC

363..పర్యటకులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది.

image:RKC

155620..సైబర్‌ క్రైం జరిగినపుడు దీనికి ఫోన్‌ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో డబ్బులు పోయినా, మోసాలు చేసినా ఫిర్యాదు చేయొచ్చు.

image:RKC

1906..ఇంట్లో గ్యాస్‌ లీకైనట్టు అనిపిస్తే ఈ సంఖ్యకు చేస్తే సాంకేతిక సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు.

image:RKC

వైద్యరంగంలో స్థిరపడాలంటే డాక్టరే అవ్వాలా?

విదేశాల్లో చదవాలంటే.. ఈ పరీక్షలు రాయాల్సిందే!

పర్యావరణ హితం రంగుల హోలీ!

Eenadu.net Home