ఉద్యోగి... ఈ పొదుపు మంత్రం మరవొద్దు!
పొదుపు చేయడం ఎంత త్వరగా అలవాటు చేసుకుంటే అంత మంచి భవిష్యత్తు సాధ్యమవుతుంది.
image:RKC
చాలా దేశాల్లో ప్రజలు వారి వేతనంలో 75 శాతం పొదుపు చేస్తారు. మిగిలిన 25 శాతమే వేతనమనుకొని ఖర్చు చేసుకుంటారు.
image:RKC
ఏదైనా వాహనం/వస్తువు కొనాలనుకున్నా లగ్జరీలకు పోకుండా తక్కువ ధరలో లభించేవి లేదా సెకండ్ హ్యాండ్‌వి కొంటారు. మనమూ అలాంటి విధానాన్ని అలవాటు చేసుకోవాలి.
image:RKC
ఉద్యోగులయితే వచ్చిన వేతనంలో పొదుపునకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఖర్చులు వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
image:RKC
కొంత మొత్తాన్ని ఆర్‌డీ, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెట్టండి. కొంతకాలానికి ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది.
image:RKC
అమ్మాయి ఉంటే వాళ్ల చదువుతో పాటే పెళ్లికి అయ్యే ఖర్చులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక అంచనాతో కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం లేదా సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో చేరడం వల్ల ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు.
image:RKC
భూమి విలువ నానాటికీ పెరుగుతుంది. కాబట్టి.. వచ్చే వేతనం/ ఆదాయంలో భూములు కొనడానికి వీలుంటే కొనేయండి. ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు వాటిని విక్రయించి డబ్బు పొందొచ్చు.
image:RKC
ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడితే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి.. కొంత మొత్తం భరించి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య బీమా చేయిస్తే భవిష్యత్తు ఆస్పత్రి ఖర్చులు మిగిలినట్లే.
image:RKC
ప్రతి నెలా కొంతమొత్తాన్ని పక్కన పెట్టేస్తే ఇతరుల వద్దగానీ బ్యాంకుల్లోగానీ అప్పు తీసుకోకుండా ఉంటారు.
image:RKC