మాజీ మిస్‌ వరల్డ్‌.. బాలీవుడ్‌ టు టాలీవుడ్‌!

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వరుణ్‌ తేజ్‌ 13వ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 

Image: Instagram/Manushi Chhillar

మిస్‌ వరల్డ్‌-2017 కిరీటం దక్కించుకున్న మానుషి.. గతేడాది అక్షయ్‌కుమార్‌ ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో తెరంగేట్రం చేసింది. 

Image: Instagram/Manushi Chhillar

సినిమా ఆడకపోయినా.. ‘సంయోగిత’ పాత్రలో మానుషి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

Image: Instagram/Manushi Chhillar

ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది మానుషి. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడిగా పరిచయమవుతున్న VT13లో నటించేందుకు ఆతృతగా ఉన్నట్లు తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టింది. 

Image: Instagram/Manushi Chhillar

హరియాణాలో పుట్టి పెరిగిన ఈ అందాల భామ.. మోడలింగ్‌పై ఆసక్తితో ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టింది. అందాల పోటీల్లో పాల్గొంటూ 2017లో ప్రపంచ సుందరి టైటిల్‌ సొంతం చేసుకుంది.

Image: Instagram/Manushi Chhillar

మోడలింగ్‌ చేస్తూ చదువును అశ్రద్ధ చేయలేదు. ఈమె డాక్టర్‌. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే కావడంతో.. తను కూడా వైద్యవిద్యనే అభ్యసించింది.

Image: Instagram/Manushi Chhillar

ప్రస్తుతం ఈ సుందరి.. బాలీవుడ్‌లో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’, ‘టెహ్రాన్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Image: Instagram/Manushi Chhillar

దర్శకుల్లో తనకు ఎస్‌. ఎస్‌. రాజమౌళి చాలా ఇష్టమని.. ఆయన దర్శకత్వంలో నటించాలని ఉందంటూ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది.

Image: Instagram/Manushi Chhillar 

స్టాక్ బ్రోకరేజీ సంస్థ జీరోదా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో మానుషి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇరువురు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.

Image: Instagram/Manushi Chhillar

This browser does not support the video element.

ఇక సోషల్‌మీడియాలో మానుషి చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్య గ్లామర్‌ డోస్‌ పెంచి.. ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తోంది. 

Image: Instagram/Manushi Chhillar

ప్రపంచ సుందరి అందాలకు యువత ఫిదా అవుతోంది. మానుషిని ఇన్‌స్టాలో 6.4మిలియన్‌ నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

Image: Instagram/Manushi Chhillar

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home