ఈ వ్యాయామాలు ఇంట్లోనే చేయొచ్చు!

స్పాట్‌ జాగింగ్‌


బయటకు వెళ్లలేకపోయినా.. ట్రేడ్‌మిల్‌ లేకపోయినా ఫర్వాలేదు. ఇంట్లోనే ఉన్న చోటనే కాళ్లు, చేతులు ఆడిస్తూ జాగింగ్‌ చేయొచ్చు. జాగింగ్‌తో ఎముకలు బలంగా మారుతాయి. బరువు తగ్గుతారు.

Image: RKC

స్ట్రెచస్‌


జిమ్‌లోనే ఒళ్లు విరవాలా? ఇంట్లోనూ ఒళ్లు విరిచే కసరత్తులు చేసుకోవచ్చు. దీని వల్ల రక్తం సరఫరా సజావుగా సాగుతుంది. గాయాల వల్ల వచ్చే దుష్ప్రాభావాలు తగ్గుతాయి. కండరాల పనితీరు మెరుగవుతుంది. బాడీ ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.

Image: RKC

పుషప్స్‌


పుషప్స్‌ కోసం ప్రత్యేక స్థలం అక్కర్లేదు. ఇంట్లోనే కాస్త ఖాళీ స్థలం దొరికినా అక్కడ పుషప్స్‌ చేయొచ్చు. ఈ వ్యాయామం వల్ల కండరాలు ధృడంగా మారుతాయి. బరువు తగ్గుతారు.

Image: RKC

సిటప్స్‌


దీనికీ బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే చక్కగా సిటప్స్‌ చేసుకోవచ్చు. ఈ వ్యాయామం వల్ల నడుము, కండరాల నొప్పులు రావు. శరీరం ధృడంగా ఉంటుంది.

Image: RKC

స్కిప్పింగ్‌


ఇంటిల్లిపాది చేయగల సులభమైన వ్యాయామం ఇది. దీని వల్ల శరీరంలో రక్తం సరఫరా, జీర్ణ వ్యవస్థ మెరుగవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image: RKC

స్టెప్స్‌ వాకింగ్‌


అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవాళ్లు మెట్లు ఎక్కి దిగుతూ ఉంటే వ్యాయామం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా రోజూ చేస్తే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది.

Image: RKC

డ్యాన్సింగ్‌


వ్యాయామం బోర్‌ అనిపిస్తే నచ్చిన పాటకు డ్యాన్స్‌ చేసినా సరిపోతుంది. దీని వల్ల శరీరంలోని అన్ని కండరాలు ఉత్తేజితమవుతాయి. బరువూ తగ్గొచ్చు. హృదయ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.

Image: RKC

యోగా


శరీరంలోని ప్రతి అణువుకు మేలు చేకూర్చే సాధనం యోగా. రోజూ ఉదయం ఇంట్లోనే మీకు వీలైన, చేయగలిన ఆసనాలు వేస్తూ ఉంటే.. ఫిట్‌నెస్‌తోపాటు ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది.

Image: RKC

ధ్యానం


శారీరక, మానసిక ఆరోగ్యానికి ధ్యానం చేయాలి. ప్రతి రోజు మీ ఇంట్లో నిశ్శబ్దంగా ఉండే చోట మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలపాటు ధ్యానం చేసి చూడండి.

Image: RKC

తులిప్‌ గార్డెన్‌.. విశేషాలు తెలుసా?

ఏప్రిల్‌ 16 చార్లీ చాప్లిన్‌ జయంతి

ఏకాంతాన్ని ఆస్వాదించండి..

Eenadu.net Home