గాలి కాలుష్యం గురించి మీకివి తెలుసా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. పదిలో తొమ్మిది మంది కాలుష్యపూరిత గాలిని పీల్చుతున్నారు.
Image: RKC
ఏటా 70లక్షల మంది గాలి కాలుష్యం.. దాని సంబంధిత సమస్యల బారిన పడి మృతి చెందుతున్నారు.
Image: RKC
అల్పాదాయ, ఆగ్నేయాసియా దేశాల్లో గాలి కాలుష్యం.. దాని సంబంధిత సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
గాలికాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కన్నా.. ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించే అవకాశాలు 20శాతం ఎక్కువగా ఉన్నాయట.
Image: RKC
మోటారు వాహనాలు, అడవులు నరికివేత, పరిశ్రమల నుంచి వెలువడే హానికర వాయువులు, వ్యర్థాల కాల్చివేత వంటి గాలి కాలుష్యానికి ముఖ్య కారణాలుగా చెప్పొచ్చు.
Image: RKC
గాలిలో ఉండే పీఎం 2.5 సూక్ష్మ కాలుష్య కారకాలు మనలోకి ప్రవేశించి.. శరీరమంతా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊపిరితిత్తులు, గుండె, మెదడును దెబ్బతీస్తాయి.
Image: RKC
ఎక్కువగా గాలి కాలుష్యానికి గురైన చిన్నారుల్లో ఊపిరితిత్తుల సమస్యల ఏర్పడొచ్చు. క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.
Image: RKC
ఇంట్లో వెలువడే కాలుష్యం గురించి ఎవరూ పట్టించుకోరు. ముఖ్యంగా వంటగది విషయంలో. దాదాపు 300 కోట్ల మందికి వంట చేసుకునేందుకు అవసరమైన ఇంధనం అందుబాటులో లేదు.
Image: RKC
గాలికాలుష్యం మన ఆరోగ్యాన్నే కాదు.. భూమిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. వాతావరణంలో మార్పులకు గాలి కాలుష్యమూ ఓ కారణంగా నిలుస్తోంది.
Image: RKC
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. అత్యంత గాలి కాలుష్యమున్న నగరాల్లో ఎక్కువ నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం.
Image: RKC