అమృత అయ్యర్.. ఈసారి ‘మీనాక్షి’గా
చెన్నైలో పుట్టి, బెంగళూరులో పెరిగిన అమృత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో మెరిసింది. తర్వాత షార్ట్‌ఫిల్మ్స్‌లో తళుక్కుమంది.
2012 నుంచి 2016 వరకు పలు తమిళ చిత్రాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించింది. ‘పడైవీరన్’ (2018)తో నాయికగా కెరీర్ ప్రారంభించింది.
‘విజిల్’లో క్రీడాకారిణిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో, టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
అమృత తొలి తెలుగు చిత్రం ‘రెడ్’. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’లో ‘అమ్మాయిగారు’గా కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ‘అర్జున ఫల్గుణ’లో శ్రావణిగా సందడి చేసింది.
ఈసారి మీనాక్షిగా కనిపించి ఆకట్టుకుంది. తేజ సజ్జతో కలిసి ఈమె నటించిన చిత్రం ‘హను-మాన్’. ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం హీరో ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు.
‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎంత మంచి పాత్రల్లో నటించామన్నది ముఖ్యం’ అని అంటుంటుంది. గ్లామర్ పాత్రలకు ప్రస్తుతానికి ‘నో’ అంటోంది.
‘జయాపజయాలను పట్టించుకోను. ఎంపిక చేసుకున్న పాత్రలకు న్యాయం చేశానా, లేదా? అని మాత్రమే ప్రశ్నించుకుంటా’ అని ఓ సందర్భంలో చెప్పింది.
అభిమాన నటులు: అల్లు అర్జున్, సమంత. హాబీ: వంట చేయడం, డ్యాన్స్ చేయడం, పుస్తక పఠనం.
Images: Instagram/amritha aiyer