లేటెస్ట్‌ సెన్సేషన్‌ జనై భోస్లే.. ఎవరో తెలుసుగా!

ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే గురించి సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం!

జనై పుట్టినరోజు వేడుకలకు టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హాజరయ్యాడు. వీరిద్దరూ దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

దీంతో జనై.. సిరాజ్‌ గర్ల్‌ఫ్రెండ్ అని రూమర్లు పుట్టించేశారు. అయితే తమ మధ్య సోదరభావమే ఉందని ఇన్‌స్టాలో స్టోరీల ద్వారా ఇద్దరూ వారి అభిప్రాయాన్ని తెలిపారు. 

జనై ఓ బాలీవుడ్‌ సింగర్‌. 2002లో ముంబయిలో పుట్టింది. స్విట్జర్లాండ్‌లో చదువుకుంది.

చిన్నప్పట్నుంచే సంగీతం అంటే ఇష్టం. చదువు పూర్తయ్యాక ఇండియా తిరిగొచ్చిన జనై మ్యూజీషియన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

సంగీతంలో తన అమ్మమ్మనే స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలనుకుంటున్నట్టు అనేక సందర్భాల్లో చెప్పింది జనై.

‘6ప్యాక్’ బ్యాండ్‌లో చేరి సింగర్‌గా, మ్యూజీషియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ పేరు సంపాదించుకుంది.

చదువుకుంటూనే నృత్యంలోనూ శిక్షణ తీసుకుంది. సంప్రదాయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన జనై స్టేజి ప్రదర్శనలూ ఇస్తోంది.

బాస్కెట్‌బాల్‌ అంటే ఇష్టం. తన టీమ్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో తరచూ పోస్టు చేస్తుంటుంది.

క్రికెట్‌ మ్యాచ్‌లు లైవ్‌లో చూడడం ఇష్టం. అమ్మమ్మతో కలిసి అప్పుడప్పుడూ స్టేడియంలో సందడి చేస్తుంది. 

తరచూ మ్యూజికల్‌ నైట్‌లను నిర్వహిస్తుంటుంది. ఈమె కన్సర్ట్‌లకు క్రేజ్‌ మామూలుగా ఉండదు.  

కేకులు, డిజర్ట్‌లు ఫేవరెట్‌ ఫుడ్‌. ట్రెడిషనల్‌గా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంది.   

నెట్‌ఫ్లిక్స్‌లో ఫస్ట్‌వీక్‌ అదరగొట్టిన మూవీస్‌

వయ్యారాల జాబిల్లి ఓణీ కడితే..!

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

Eenadu.net Home