#eenadu

#eenadu

సినిమాలంటే ఇష్టం లేదు. నటనపై ఆసక్తి లేదు. మోడలింగ్‌ చేసేటప్పుడు మలయాళ సినిమాలో అవకాశం దక్కింది. ముందు వద్దనుకున్నా చివరకు నటించాల్సి వచ్చింది.

నటిని కాకపోయుంటే లెక్చరర్‌గానో నృత్య కళాకారిణిగానో స్థిరపడేదాన్ని. లేదా చార్టడ్‌ అకౌంటెంట్‌ కావాలన్న కల నెరవేర్చుకునేదాన్ని.

మనసుకు నచ్చిన పాత్రలే పోషిస్తా. డబ్బు కోసం రొటీన్‌ రోల్స్‌ ప్లే చేయను. తమిళ్‌ ‘బిల్లా’లో బికినీలో కనిపించా. మళ్లీ సేమ్‌ క్యారెక్టర్‌ చేయలేక తెలుగు ‘బిల్లా’ వదులుకున్నా.

తెరపైనే కాదు బయటా సెలబ్రిటీలకు భావోద్వేగాలుంటాయి. ఓ దశలో పెళ్లి చేసుకుని సినిమాలు ఆపేయాలనుకున్నా. కానీ, నటనే నన్ను బాధ నుంచి బయటకు తీసుకొచ్చింది.

కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూ ఇచ్చా. అందులో నేను చెప్పని విషయాలను కూడా కొన్ని వెబ్‌సైట్లు రాశాయి. అప్పటి నుంచే మీడియాకు దూరంగా ఉంటున్నా.

నేను తీసుకున్న చెత్త నిర్ణయం ‘గజిని’ సినిమాని అంగీకరించడం. నా పాత్ర విషయంలో చెప్పిందొకటి.. చూపించింది మరొకటి.

గ్లామర్‌ అనేది దుస్తుల్లోనో మేకప్‌లోనో కాదు వ్యక్తిత్వంలో ఉంటుంది. అందుకే తక్కువ మేకప్‌తోనే నటిస్తుంటా. చీరలోనే నాకు నేను అందంగా కనిపిస్తా. 

‘శ్రీరామరాజ్యం’ టైమ్‌కి నా సక్సెస్‌ రేట్‌ తక్కువగా ఉంది. నేను సీతగా కనిపించనున్నానని తెలిసి కొందరు విమర్శించారు. నా పని నేను చేశా, విజయం అందుకున్నా. ఆ మూవీ నా దృక్పథాన్ని మార్చేసింది.

భగవంతుడు ఒక్కడే అని నా అభిప్రాయం. నేను క్రిస్టియన్‌ అయినా హిందూ దేవాలయాలూ దర్శించుకుంటా.

లేడీ సూపర్‌స్టార్‌గా క్రేజ్‌ సొంతం చేసుకున్న నయనతార వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అంశాలపై రూపొందిన డాక్యుమెంటరీ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home