#eenadu

నిర్మలా సీతారామన్‌ ఈ సారి కూడా బడ్జెట్‌కు చేనేత చీరనే ఎంచుకున్నారు. తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్‌ కలగలిపిన మంగళగిరి చేనేత కళాకారులు నేసిన పట్టు చీరలో కనిపించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ వేళ కాంతా చీరలో కళగా కన్పించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు ప్రతీకగా ‘రామా బ్లూ’ చీర ధరించారు.

2023

బ్రౌన్‌, గోల్డెన్‌ రంగులతో టెంపుల్‌ బోర్డర్‌, అక్కడక్కడా బుటీలతో రూపొందించిన ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.

2022

మెరూన్‌, సిల్వర్‌ కలర్‌లు ఉపయోగించి ఒడిశా చేనేత కళాకారులు నేసిన చీరను ధరించారు. ఈ శారీలో నిర్మలమ్మ నిరాడంబరంగా, సాదాసీదాగా కనిపించారు.

2021

ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరను ధరించారు. ఈ తెలంగాణ పోచంపల్లిని సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 

2020

నీలం రంగు అంచుతో ఉన్న పసుపుపచ్చ రంగు చీరలో మెరిశారు. ఇది శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్‌ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు.

2019

మంగళగిరి గులాబీ రంగు చీరను ధరించారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్‌కు బదులుగా బహీ ఖాతాను తీసుకువచ్చారు.

వీళ్లు ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో తెలుసా?

మెటల్‌ మెరుపులు అద్దుకున్న క్రెడిట్‌ కార్డులివే

రాంగ్‌ నంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా?

Eenadu.net Home