అవును.. అనుష్క శర్మ సిస్టర్‌నే
రుహానీ శర్మ.. ‘చి.ల.సౌ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘హిట్’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హెచ్.ఇ.ఆర్’లో విభిన్న పాత్రలతో మెప్పించింది.
ఇప్పుడు ‘సైంధవ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రమిది. శైలేష్ కొలను తెరకెక్కించారు.
ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ‘మీరు అనుష్క శర్మ సిస్టరా?’ అనే ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది.
‘అనుష్క శర్మ నాకు అక్క అవుతుందనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మీకెలా తెలిసింది?’ అని సరదాగా ప్రశ్నించింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో జన్మించిన రుహానీ.. పంజాబ్‌లో చదువుకుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టా అందుకుంది.
చదవయ్యాక మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ‘కడైసి బెంచ్ కార్తీ’ (తమిళ్)తో తెరంగేట్రం చేసింది. మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించింది.
‘పాయిజన్’, ‘మీట్ క్యూట్’ వెబ్‌సిరీస్‌లతోనూ అలరించింది. కథ నచ్చితే తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా పట్టించుకోదు. సైకో పాత్రలో నటించాలనేది తన డ్రీమ్.
చిన్నప్పుడు.. డాక్టర్ కావాలనుకుంది. ఇప్పుడు.. ‘సైంధవ్’లో డాక్టర్ రేణుగా నటించి ఆ కోరిక నెరవేర్చుకుంది.