‘సైంధవ్‌’ జోడీ.. శ్రద్ధ గురించి మీకివి తెలుసా?

వెంకటేశ్‌ 75వ చిత్రం ‘సైంధవ్‌’. ఆయన సరసన శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. సినిమా విడుదల తేదీ: జనవరి 13.

ఇందులో మనోజ్ఞగా కనిపించనుంది. ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు.

‘జెర్సీ’తో తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంది. ‘జోడి’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’లోనూ సందడి చేసింది.

మూడేళ్ల తర్వాత ‘సైంధవ్‌’తో మరోసారి తెలుగు వారికి హాయ్‌ చెప్పనుంది. ప్రస్తుతం.. కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో జన్మించింది. తండ్రి ఆర్మీలో పనిచేయడంతో చాలా రాష్ట్రాల్లో పెరిగింది. 7-10 వరకు సికింద్రాబాద్‌లో చదువుకుంది.

బెంగళూరులో ఎల్‌ఎల్‌బీ చదివింది. కార్పొరేట్‌ లాయరుగా పనిచేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ రంగంలోనే స్థిరపడాలనుకుంది.

లాయర్‌గా పని చేస్తూనే పలు వేదికలపై నాటకాలు ప్రదర్శించేది. అలా ప్రకటనల్లో నటించే అవకాశాలు అందుకుంది. మలయాళ సినిమా ‘కోహినూర్‌’తో హీరోయిన్‌గా మారింది. 

తీరిక వేళల్లో.. చెన్నైలో తమకున్న వ్యాపారాలు చూసుకుంటుంది. విహార యాత్రలు చేస్తుంటుంది. 

అభిమాన నటులు: హృతిక్‌ రోషన్, సల్మాన్‌ ఖాన్‌, మమ్ముట్టి. మణిరత్నం- ఏఆర్‌ రెహమాన్‌ కాంబినేషన్‌లో పని చేయాలనుందట.

‘‘జెర్సీ’ సినిమాకి ఎంపికైన సమయంలో.. కెరీర్‌ ప్రారంభంలోనే తల్లిగా నటించడం అవసరమా?’ అని చాలామంది అన్నారు. కథ బాగా నచ్చడంతో నేను వెనకడుగు వేయలేదు’’ అని ఓ సందర్భంలో తెలిపింది. ‘సైంధవ్‌’లోనూ మదర్‌ క్యారెక్టర్‌ ప్లే చేసింది.

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home