ధోనీతో యాడ్‌ ఎప్పటికీ మర్చిపోలేను!

‘కొత్త కొత్తగా’తో ప్రేక్షకులను అలరించిన విర్తి వాఘని ఇప్పుడు ‘సుందరకాండ’తో మరోసారి పలకరించేందుకు సిద్ధమవుతోంది. నారా రోహిత్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదలకు సిద్దంగా ఉంది. 

ముంబయిలో జన్మించిన విర్తి చిన్నతనం నుంచే వివిధ బ్రాండ్లకు ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టింది.

2008లో ‘జై శ్రీ కృష్ణ’ సీరియల్‌తో యువ రాధ పాత్రతో నటిగా అరంగేట్రం చేసింది.

 ఆ తర్వాత హిందీలో సీరియల్స్‌తోపాటు.. ‘ఆర్య’ వెబ్ సిరీస్‌ రెండు సీజన్లలో నటించింది. 

 విర్తికి విహారయాత్రలంటే ఇష్టం. కొత్త ప్రదేశాలను చుట్టేస్తూ.. ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. 

 సంప్రదాయ దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంది. చీరలు, లెహంగాల్లో ఆమె పోజులు, ఫొటోలు సోషల్‌ మీడియాలో ఫేమస్‌. 

భరత నాట్యంలోనూ విర్తికి ప్రావీణ్యం ఉంది. స్టేజ్‌ ప్రదర్శనలిస్తూ ఉంటుంది. 

మహేంద్ర సింగ్‌ ధోని అంటే అమితమైన ఇష్టం. ధోనీతో కలసి చేసిన జియో మార్ట్‌ ప్రకటన ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది.

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home