‘ఫెయిర్ & లవ్‌లీ’ బ్యూటీ.. యామీ గౌతమ్

ప్రకటనలో నటించి పాపులారిటీ సంపాదించుకొని.. సినిమావకాశాలు పొందిన వాళ్లు చాలామంది ఉన్నారు. అదే జాబితాలో యామీ గౌతమ్ ఒకరు.. 

image:instagram/yamigautam

సినిమాల్లోకి రాకముందే ‘ఫెయిర్‌ & లవ్‌లీ’తో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ నటి, సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకొంది. 

image:instagram/yamigautam

అభిషేక్‌ బచ్చన్‌ ‘దస్‌వీ’లో అలరించిన యామీ.. తాజాగా ఓటీటీలో విడుదల కానున్న ‘లాస్ట్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

image:instagram/yamigautam

ఈ విషయాన్ని తన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రకటించింది. ‘నిజాన్ని వెతుక్కుంటూ ఆమె ప్రయాణం మొదలుపెట్టడానికి సిద్ధమవుతోంది.’ అంటూ రాసుకొచ్చింది. 

image:instagram/yamigautam

అనిరుధ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యామీ.. క్రైమ్‌ రిపోర్టర్‌గా కనిపించనుంది. మరి ఈ సుందరి ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. 

image:instagram/yamigautam

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌ పూర్‌లో 1988 నవంబరు 28న జన్మించిందీ బ్యూటీ. 

image:instagram/yamigautam

సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన యామీ.. 2010లో కన్నడలో ‘ఉల్లాస ఉత్సాహ’తో సినీరంగంలో అడుగు పెట్టింది. 

image:instagram/yamigautam

తెలుగులో ‘నువ్విలా’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్’లో కథానాయికగా నటించింది.

image:instagram/yamigautam

This browser does not support the video element.

హిందీ, కన్నడ, మలయాళం, తమిళ చిత్రల్లో కూడా నటించింది. 

image:instagram/yamigautam

2021 జూన్ 4న సినీ రచయిత, దర్శకుడు ఆదిత్య ధర్‌ను వివాహం చేసుకుంది.

image:instagram/yamigautam

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యామీకి ఇన్‌స్టాలో 16.9 మిలియన్ల ఫాలోవర్లున్నారు.

image:instagram/yamigautam

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home