గ్రూప్‌గా ట్రిప్‌కి వెళ్తున్నారా? ఈ టిప్స్ ఫాలోకండి
కమిటీ
బృందంగా ఏర్పడి ఏదైనా విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని.. కోఆర్డినేటర్‌ను నియమించుకోవాలి. టూర్ బాధ్యతలు వారికే అప్పగించాలి.
Image: Pixabay
డేట్ ఫిక్స్
ఓ నలుగురిని ఒక్కచోటుకు చేర్చడం అంత సులభమేమి కాదు. అందుకే, టూర్‌కి వెళ్లే డేట్స్‌ను కొన్ని రోజుల ముందుగానే ఫిక్స్ చేయాలి. ఆ లోపు పనులు చక్కబెట్టుకొని.. టూర్‌కి సిద్ధమయ్యే అవకాశముంటుంది.
Image: Pixabay
డెస్టినేషన్
పది మంది ఉంటే.. పది ప్రాంతాల పేర్లు వినిపిస్తాయి. వాటిల్లో ఒక్క ప్రాంతాన్ని ఎంచుకొని అందరి ఆమోదం పొందేలా చూసుకోవాలి.
Image: Pixabay
బడ్జెట్
గ్రూప్‌గా వెళ్తున్నప్పుడు బడ్జెట్ భారీగానే ఉంటుంది. కాబట్టి.. ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకొని సభ్యులందరూ సమానంగా వాటా వేసుకోవాలి.
Image: Pixabay
బుకింగ్స్
రైలు, హోటల్ బుకింగ్స్‌ను ముందుగానే చేసుకోవాలి. ఎక్కువమంది వెళ్లినట్లయితే కొన్ని హోటల్స్ డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. అలాంటి ఆఫర్స్‌ను వినియోగించుకుంటే డబ్బు ఆదా అవుతుంది.
Image: Pixabay
ప్రైవసీ
ఎంత బృందంగా వెళ్లినా.. సభ్యులందరూ తమకంటూ కొంత వ్యక్తిగత సమయం కేటాయించుకోవాలి. అప్పుడే వెళ్లిన చోట నచ్చిన ప్రదేశానికి వెళ్లడం, నచ్చిన ఫుడ్ తినడం, షాపింగ్ వంటివి చేసుకోవచ్చు.
Image: Pixabay
అటెండెన్స్
విహారయాత్రలో ఎక్కడికి వెళ్లినా.. వారి వివరాలు కోఆర్డినేటర్‌కు తెలిసేలా చూసుకోవాలి. రోజు/ట్రిప్ ముగిసే సమయానికి అందరూ ఒక చోటుకు చేరుకోవాలి. సమన్వయం కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు.
Image: Pixabay
ట్రావెల్ ఏజెంట్
టూర్ మొత్తం బాధ్యతలు ఒక కోఆర్డినేటర్ మాత్రమే చూసుకోవడం కష్టమవొచ్చు. అలాంటప్పుడు ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించొచ్చు. వారే హోటల్ బుకింగ్ నుంచి సైట్ సీయింగ్ వరకూ దగ్గరుండి చూసుకుంటారు.
Image: Pixabay
ఫొటో క్లిక్
ఎక్కడికి వెళ్లినా.. గ్రూప్‌గా ఒక ఫొటో తప్పనిసరిగా తీసుకోండి. అది కేవలం జ్ఞాపకంగానే కాదు.. మీ బంధానికి ప్రతిబింబంగా నిలిచిపోతుంది. తరచూ అలాంటి ట్రిప్‌కి వెళ్లాలనే కోరికను కలిగిస్తుంది.
Image: Unsplash