భారత్ మెచ్చిన టాప్ 10 హాలీవుడ్ స్టార్స్!
హాలీవుడ్ చిత్రాలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. దీంతో అక్కడి హీరోయిన్లు కూడా మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో జులై నెలలో భారత్ మెచ్చిన టాప్ 10 హాలీవుడ్ హీరోయిన్ల జాబితాను ఓర్‌మ్యాక్స్ మీడియా సంస్థ విడుదల చేసింది. మరి వారెవరో చూద్దామా...(Photos:RKC)
1. స్కార్లెట్ జోహన్సన్
అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భామ.. హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ‘ఎవేంజర్స్..’ సిరీస్‌లో నటాషాగా భారతీయ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈమెకు డెన్మార్క్ పౌరసత్వం కూడా ఉంది.
2. ఎమ్మా వాట్సన్
పూర్తి పేరు ఎమ్మా ఛార్లెట్ డ్యురె వాట్సన్. ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చెందిన ఈ బ్యూటీ.. జేకే రోలింగ్ రాసిన పుస్తకాల ఆధారంగా తెరకెక్కిన ‘హ్యారీపోటర్.. ’సిరీస్‌తో ప్రపంచమంతా ఫేమసైంది.
3. ఏంజిలినా జోలి
హాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోయిన్. 1982 నుంచి సినిమాల్లో నటిస్తోంది. ‘అలెగ్జాండర్’, ‘మిస్టర్ మిసెస్ స్మిత్’, ‘సాల్ట్’, ‘ఎటర్నల్స్’ తదితర చిత్రాల్లో నటించింది.
4. జెన్నిఫర్ లారెన్స్
ఈమెకు కూడా భారత్‌లో భలే క్రేజ్ ఉంది. ఎక్కువగా ‘ఎక్స్-మెన్’, ‘ది హంగర్ గేమ్స్’ సిరీస్‌ల్లో కనిపిస్తుంటుంది. తాజాగా ‘నో హార్డ్ ఫీలింగ్స్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
5. గాల్ గడొట్
ఇజ్రాయెల్‌కు చెందిన గాల్.. హాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈమె ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో నటిస్తుంటుంది. ‘వండర్ విమెన్’గానూ పాపులరైంది.
6. జెండయా
నటిగా.. గాయనిగా హాలీవుడ్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ‘స్పైడర్ మ్యాన్’, ‘డ్యూన్’ సిరీస్‌ల్లో నటించింది. పలు టీవీ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ఆకట్టుకుంది.
7. ఎమ్మా స్టోన్
ఈ బ్యూటీ 2012లో వచ్చిన ‘ది అమేజింగ్ స్పైడర్‌మ్యాన్’, ‘జాంబీల్యాండ్’ సిరీస్‌ల్లో నటించింది. ‘లాలా ల్యాండ్’లో ఈమె నటనకు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ దక్కింది.
8. ఎలిజబెత్ ఓస్లెన్
‘కెప్టెన్ అమెరికా’ సిరీస్‌లో వాండా మ్యాక్సీమాఫ్ పాత్ర ఈమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ఎవేంజర్స్’ సిరీస్‌లోనూ అదే పాత్రతో మెప్పించింది.
9. మార్గాట్ రాబీ
ఆస్ట్రేలియాకు చెందిన మార్గాట్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’లో నటించి స్టార్‌గా మారిపోయింది. ‘ది లెజెండ్ ఆఫ్ టార్జాన్’, ‘వన్స్ అపాన్ ఏ టైం ఇన్ హాలీవుడ్’లో నటించిన ఈమె.. తాజాగా ‘బార్బీ’తో అలరించింది.
10. అనా డీ ఆర్మోస్
క్యూబాకు చెందిన అనా.. ‘ఎక్స్‌పోజ్డ్’, ‘బ్లేడ్ రన్నర్ 2049’ జేమ్స్‌బాండ్ సిరీస్‌లోని ‘నో టైం టు డై’, ‘ది గ్రే మ్యాన్’ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.